సల్మాన్, అక్షయ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన కాజోల్
బాలీవుడ్ క్రేజీ నటి కాజోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సల్మాన్‌ఖాన్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్నాయి.
By: Tupaki Desk | 19 Jun 2025 8:00 PM ISTబాలీవుడ్ క్రేజీ నటి కాజోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సల్మాన్‌ఖాన్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్నాయి. రీసెంట్‌గా ఓ మీడియాతో మాట్లాడుతూ కాజోల్ బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ గురించి ఆసక్టికర వ్యాఖ్యలు చేసింది. తనది అద్వితీయమైన స్టార్ పవర్ అని, దాన్ని ఎవరూ టచ్ చేయలేరంది. సల్మాన్‌ను పొగిడే ప్రయత్నంలో కాజోల్ అక్షయ్ కుమార్‌ని తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు రచ్చకు తెర లేపింది.
అంతే కాకుండా తన స్టేట్మెంట్‌తో అక్షయ్ కుమార్ కూడా ఏకీభవిస్తాడని చెప్పి సల్మాన్ వర్సెస్ అక్షయ్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. కాజల్ చేసిన వ్యాఖ్యలపై అక్షయ్ కుమార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ చరిష్మా, ఆయన స్టార్‌డమ్ ఎవరూ మ్యాచ్ చేయలేదే అయినా అక్షయ్ సాధించిన విజయాలకు కూడా సమాన గౌరవం ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.
సల్యాన్, అక్షయ్‌ల కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు 18కి పైనే ఉన్నాయి. అక్షయ్‌కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. తనకు హీరోగా అత్యంత నమ్మకమైన స్టార్ అనే ట్యాగ్ ఉంది. అలాంటి హీరోని పట్టుకుని తన వ్యాఖ్యలతో అక్షయ్ కూడా ఏకీభవిస్తాడని కాజోల్ కించపరడం మాకు ఏమాత్రం నచ్చలేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా వీరికి సమకాలీన హీరోగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న తన భర్త అజయ్ దేవ్‌గన్‌ని కాజోల్ పూర్తిగా పక్కన పెట్టి సల్మాన్ ఖాన్ భజన చేయడం ఏమాత్రం బాగాలేదని కామెంట్‌లు చేస్తున్నారు.
కాజోల్ చేసిన వ్యాఖ్యలని బట్టి ఇండస్ట్రీలో స్టార్ పవర్‌కే పెద్ద పీట వేస్తారన్నది మరో సారి రుజువైందని అంటున్నారు. సల్మాన్ ఖాన్‌కున్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆయనని పొగిడే ప్రయత్నంలో ఇతర స్టార్లని తక్కువ చేసి చూపించడం మాత్రం తగదని, ఇలాంటి కామెంట్‌లు కాజోల్ మరోసారి రిపీట్ చేయకపోవడం మంచిదని బాలీవుడ్ సినీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.
