అంత్యక్రియల్లోనూ వెంటాడి వేధిస్తున్నారు!
సెలబ్రిటీలు బయటకొస్తే ఫోటోగ్రాఫర్లు గ్యాప్ లేకుండా క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. ఆమె ఎంత సేపు ఉంటే అంత సేపు కెమెరా క్లిక్ మంటూనే ఉంటుంది.
By: Tupaki Desk | 14 Jun 2025 3:00 PM ISTసెలబ్రిటీలు బయటకొస్తే ఫోటోగ్రాఫర్లు గ్యాప్ లేకుండా క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. ఆమె ఎంత సేపు ఉంటే అంత సేపు కెమెరా క్లిక్ మంటూనే ఉంటుంది. అది సినిమా ఈవెంట్ అయినా? మరే ఈవెంట్ అయినా? సరే వృత్తిలో భాగంగా కొన్నిసార్లు ఫోటో గ్రాఫర్లు బిజీగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే అదే ఫోటోగ్రాఫర్లు కొన్నిసార్లు హద్దు మీరుతున్నారనే విమర్శలు కూడా చాలా సందర్బాల్లో ఎదుర్కున్నారు.
బాలయ్య, చిరంజీవి లాంటి స్టార్లు సైతం ప్రయివేట్ స్పేస్ లో ఫోటోలు తీస్తే సీరియస్ అయిన సందర్బా లున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ కూడా ఇలాంటి ఫోటోలపై మండిపడింది. అందుకు కాజోల్ కొన్ని ప్రత్యేక కారణాలు తెలిపింది. అవి ఎంతో ఆమోయోగ్యంగానూ ఉన్నాయి. ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలకు ఎదురవుతోన్న సమస్య పపరాజీ కల్చర్. ఈ ఫోటో గ్రాఫర్ల గురించి నాకు కొంత అవగాహన ఉంది.
వారు ఉండకూని ప్రదేశాలు కొన్ని ఉన్నాయనుకుంటున్నా. ఓ సెలబ్రిటీ అంత్యక్రియల్లో పాల్గనడానికి వచ్చినా? వెంట పరిగెత్తి మరీ ఫోటోలు తీస్తుంటారు. అప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది. వాళ్లపై చాలా కోపం వస్తుంది. విలువలు లేకుండా చేసే ఈ పనులేంటని అనాలనిపిస్తుంది. కానీ అనలేదు. నేను అంద రిలా సాధా రణ మహిళ అయితే వాళ్లందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసేదాన్ని.
నేను ఆ పనిచేయ లేకపోతున్నందుకు బాధగా ఉంది. అంత్యక్రియల్లోనైనా రెండు..మూడు ఫోటోలు తీసుకోవడంలో తప్పులేదు. అందుకు ఎవరూ కాదనరు. కానీ కొందరు అక్కడ పరిస్థితులు అర్దం చేసుకోకుండా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి` అని తెలిపింది.
