అవన్నీ పుకార్లు.. వారి మధ్య అలాంటివేమీ లేవు: కాజోల్
షారూఖ్ తో తన కెమిస్ట్రీ ని రొమాంటిసైజ్ చేసినా కానీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి నాటకీయత లేదని కాజోల్ అన్నారు.
By: Tupaki Desk | 3 July 2025 8:15 AM ISTదిల్ వాలే దుల్హానియా లేజాయేంగే (డిడిఎల్‌జే) ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరి కేటగిరీలో ఈ సినిమా ఒక క్లాసిక్. ముంబైలోని మరాఠా మందిర్ అనే థియేటర్ లో ఏకంగా 27 సంవత్సరాల పాటు అన్ స్టాపబుల్ గా ఆడింది ఈ చిత్రం. ముఖ్యంగా షారూఖ్ - కాజోల్ జంట కెమిస్ట్రీ ప్రజలకు అంతగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత కూడా షారూఖ్ - కాజోల్ హిట్ పెయిర్ గా వెలిగిపోయింది. కుచ్ కుచ్ హోతా హై, మై నేమ్ ఈజ్ ఖాన్, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి చిత్రాలలో ఈ జంట కెమిస్ట్రీని ప్రజలు ఎక్కువగా ఇష్టపడ్డారు. ఆ ఇద్దరూ కలిసి నటించే సినిమాకు ప్రత్యేక క్రేజ్ ఉంది.
అయితే ఇదే రీజన్ ఖాన్ పై అజయ్ దేవగన్ అసూయకు కారణమైందా? అంటే దీనికి సమాధానం కాజోల్ నుంచి వచ్చింది. చాలా కాలంగా సమాధానం లేని ప్రశ్నకు ఇప్పుడు జవాబు లభించింది. తాజా ఇంటర్వ్యూలో కాజోల్ దీనిపై ఓపెనయ్యారు. అజయ్ దేవగన్ - షారూఖ్ ఇద్దరూ సన్నిహితులు అని కాజోల్ అన్నారు. వారి మధ్య అసూయ లేదు.. అవన్నీ పుకార్లు మాత్రమేనని కాజోల్ కొట్టిపారేసారు. ఆ ఇద్దరూ కలిసి బీర్ పంచుకునేంత క్లోజ్ కాదు కానీ, ఆ ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారని, కలిసి స్నేహితుల గ్రూపులో ఉండాల్సిన అవసరం లేదని కూడా కాజోల్ అన్నారు.
షారూఖ్ తో తన కెమిస్ట్రీ ని రొమాంటిసైజ్ చేసినా కానీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి నాటకీయత లేదని కాజోల్ అన్నారు. ప్రజలు ఊహించుకునేది ఏదీ నిజ జీవితంలో జరగదని అన్నారు. కేవలం స్నేహితులుగా మాత్రమే ఉన్నామని తెలిపారు. కాజోల్ నటించిన హారర్ చిత్రం `మా` ఇటీవల విడుదలై థియేటర్లలో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో వ్యక్తిగత జీవితంలోని చాలా ఆసక్తికర విషయాలను కాజోల్ రివీల్ చేస్తున్నారు.
