Begin typing your search above and press return to search.

పెళ్లిపై ఆమె- ప్రేమపై ఈయ‌న అలా అనేశారేంటి?

అజయ్ దేవగన్ బుక్‌మైషో యూట్యూబ్ ఛానెల్‌లో త‌న సినిమా `దే దే ప్యార్ దే 2`ని ప్రమోట్ చేస్తూ ప్రేమ‌లోని డెప్త్ పై కామెంట్ చేసారు. తరతరాలుగా ప్రేమ టెర్మినాల‌జీ ఎలా మారిందో ఆయన వివ‌రించారు.

By:  Tupaki Desk   |   14 Nov 2025 2:30 PM IST
పెళ్లిపై ఆమె- ప్రేమపై ఈయ‌న అలా అనేశారేంటి?
X

బాలీవుడ్ లో ఆద‌ర్శ జంట‌గా వెలిగిపోతున్నారు అజ‌య్ దేవ‌గ‌న్- కాజోల్ దంప‌తులు. ద‌శాబ్ధాలుగా వీరి అన్యోన్య దాంప‌త్యం ఎప్పుడూ ప్రేమ జంట‌ల‌కు స్ఫూర్తి. 1995లో ఓ సినిమా సెట్స్ లో ప్రేమ‌లో ప‌డిన ఈ జంట అటుపై పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట‌కు నైసా దేవ‌గ‌న్(22) అనే అంద‌మైన కుమార్తె, యుగ్ దేవ‌గ‌న్ (11) అనే కుమారుడు ఉన్న సంగ‌తి తెలిసిందే.

అయితే పెళ్లిపై కాజోల్ తాజా కామెంట్ ఇంట‌ర్నెట్ లో సెన్సేష‌న్ గా మారింది. పెళ్లి చేసుకునేప్పుడు ఎలాంటి వ్య‌క్తిని చేసుకుంటున్నామో తెలీదు క‌దా! అందుకని పెళ్లికి ఒక ముగింపు (ఎక్స్ ప‌యిరీ) తేదీ ఉండాల‌ని, జంట మ‌ధ్య క‌ల‌త‌ల‌కు ఒక గ‌డువు ఉండాల‌ని కాజోల్ వ్యాఖ్యానించారు. స‌మ‌స్య‌ల నుంచి జంట బ‌య‌ట‌ప‌డేందుకు దంప‌తుల‌కు ఈ ముగింపు తేదీ ఉప‌యోగప‌డుతుంద‌ని ప‌రోక్షంగా అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే కాజోల్ పెళ్లి గురించి ఇలా వ్యాఖ్యానించిన ఇదే స‌మ‌యంలో అజ‌య్ దేవ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిగ్గా మారాయి. ఈరోజుల్లో యూత్ షార్ట్ క‌ట్ ప్రేమ‌క‌థ‌ల్ని ఆయ‌న క్రిటిసైజ్ చేసారు. ప్రేమ‌లోని డెప్త్ ను అర్థం చేసుకోలేని స్థితిలో యువ‌త‌రం ఉంద‌ని విమ‌ర్శించారు.

అజయ్ దేవగన్ బుక్‌మైషో యూట్యూబ్ ఛానెల్‌లో త‌న సినిమా `దే దే ప్యార్ దే 2`ని ప్రమోట్ చేస్తూ ప్రేమ‌లోని డెప్త్ పై కామెంట్ చేసారు. తరతరాలుగా ప్రేమ టెర్మినాల‌జీ ఎలా మారిందో ఆయన వివ‌రించారు. ప్రేమ ఇప్పుడు చాలా సాధార‌ణం అయిపోయింది. ప్రేమ అనే ప‌దాన్ని అన‌వ‌రంగా ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. దీనివ‌ల్ల ప్రేమ దాని అర్థం కోల్పోయింది. మా త‌రంలో ఐ ల‌వ్ యు అని చెప్ప‌డం గొప్ప విష‌యం. ఇప్పుడు ప్రేమ అనే ప‌దంలో లోతును కూడా యువ‌జ‌నం అర్థం చేసుకోలేరు! అని విమ‌ర్శించారు దేవ‌గ‌న్. ప్ర‌తి మెసేజ్‌కి హార్ట్ ఎమోజి ఉంటుంది.. లేదా ల‌వ్ ఈమోజీతో ముగుస్తుందని కూడా అజయ్ దేవ‌గ‌న్ అన్నారు. ఇది సాధార‌ణ అల‌వాటుగా మారింద‌ని కూడా వ్యాఖ్యానించారు.

కాజోల్ - అజయ్ దేవ్‌గన్ ప్రేమ‌క‌థ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. 1995లో హల్చ‌ల్ అనే మూవీ సెట్స్‌లో వారి ప్రేమకథ ప్రారంభమైంది. అసాధారణ స్నేహంగా మొద‌లై నెమ్మ‌దిగా ఒక‌రికొక‌రు అర్థం చేసుకోగ‌లిగారు. దాదాపు నాలుగు సంవత్సరాల డేటింగ్ తర్వాత ఈ జంట 1999 ఫిబ్రవరి 24న ఎలాంటి హ‌డావుడి లేకుండా జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఈ జంట అన్యోన్య దాంప‌త్యంలో ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.