అమ్మమ్మపై ప్రేమతో అమ్మకు అబద్దం!
చిన్నతనంలో అమ్మకంటే అమ్మమ్మ అంటే చాలా మంది పిల్లలు ఇష్టపడతారు. అమ్మ కొడుతుంటే అమ్మమ్మ గారాబం చేస్తుంది. అందుకే అమ్మమ్మ అంటే పిల్లలు అంతా అమితంగా ఇష్టపడతారు.
By: Tupaki Desk | 8 July 2025 12:00 AM ISTచిన్నతనంలో అమ్మకంటే అమ్మమ్మ అంటే చాలా మంది పిల్లలు ఇష్టపడతారు. అమ్మ కొడుతుంటే అమ్మమ్మ గారాబం చేస్తుంది. అందుకే అమ్మమ్మ అంటే పిల్లలు అంతా అమితంగా ఇష్టపడతారు. శ్రీలీలకు కూడా అమ్మ కంటే అమ్మమ్మ అంటేనే ఇష్టం. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ కి కూడా అమ్మమ్మ అంటే ఎంత ఇష్టమో ప్రూవ్ అయింది. అమ్మమ్మ కోసం స్కూల్ కే ఢుమ్మా కొట్టి గంటల పాటు ప్రయాణం చేయాలని నిశ్చయించుకుంది? అన్న విషయంలో ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.
11 ఏళ్ల వయసులో కాజోల్ స్కూలింగ్ సమయంలో అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదు అన్న సంగతి తెలి సిందిట. వెళ్లి చూద్దామంటే? కాజోల్ తల్లి నీకు ఎగ్జామ్ ఉందని...అవి పూర్తయిన తర్వాత వద్దు అని తెలిపిందిట. కానీ కాజోల్ మనసు మాత్రం పరీక్ష కంటే అమ్మమ్మ మీనదే ఉందిట. సరిగ్గా అదే సమయంలో తన స్నేహితు రాలు కూడా స్కూల్లో ఏదో బాదలో ఉందట. దీంతో ఇద్దరు కలిసి స్కూల్ నుంచి పారిపోవాలని డిసైడ్ చేసుకున్నారుట.
అక్కడ నుంచి ఎలాగైనా ముంబైకి వెళ్లాలనుకున్నారుట. కాజల్ చదువకుంటోన్న టౌన్ పంచంగిలో తనకు చుట్టాలున్నారుట. తన మావయ్యను కలిసి అమ్మ ఇంటికి పిలిచిందని అబద్దం చెప్పి బస్టాండ్ వరకూ తోడుగా తీసుకెళ్లిందిట. అదంతా నిజమని మావయ్య వెంట వచ్చాడు. కానీ చివరి నిమిషయంలో కాజోల్ ప్లాన్ రివర్స్ అయింది. స్కూల్లో పనిచేసే కొందరు వెతక్కుంటూ రావడంతో వాళ్ల కంట పడటంతో తిరిగి స్కూల్ కి తీసుకెళ్లిపోయారని తెలిపింది.
పంచంగి-ముంబై మధ్య ప్రయాణం ఐదు గంటలు ఉంటుంది. 11 ఏళ్ల వయసులోనే కాజోల్ అవేమి తెలి యకుండా అమ్మమ్మ కోసం అంత రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయడం విశేషం. కాజోల్ సినిమాల సంగతి చూస్తే! కాజోల్ నటించిన` మా` చిత్రం ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో రన్నింగ్ లో ఉంది. అలాగే కొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు కాజోల్ పని చేస్తోంది.
