ఆమె కూడా చెట్టు వెనుక చీర మార్చుకున్న నటే!
తాజాగా ఈ లిస్ట్ లో కాజోల్ కూడా మినహాయింపు కాదని వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శక, నిర్మాత కరణ్ జోహార్ రివీల్ చేసారు.
By: Tupaki Desk | 26 July 2025 5:00 AM ISTహీరో-హీరోయిన్లకిప్పుడు సకల సౌకర్యాలు అందుతున్నాయి. ఇంటి దగ్గర నుంచి సెట్స్ కు వెళ్లాలంటే నిర్మాత ఖరీదైన కారు పంపిస్తాడు. వెళ్లే సరికి ఆన్ సెట్స్ లో కార్వాన్ సిద్దంగా ఉంటుంది. అందులో కాసేపు విశ్రాంతి తీసుకుని కెమెరా ముందుకెళ్లొచ్చు. షాట్ అయిన వెంటనే వచ్చి మళ్లీ ఏసీ వ్యానిటీ వ్యాన్ లో దూరిపోవొచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్..మధ్నాహ్నం లంచ్...సాయంత్ర స్నాక్స్. ఇలా ప్రతీది ఆన్ సెట్స్ లో సిద్దంగా ఉంటుంది.
హీరోయిన్ అదనంగా స్టాప్ తెచ్చుకుంటే వాళ్లకు సంబంధించి ఏర్పాట్లు కూడా నిర్మాత చేయాల్సిందే. ఇలా ఇన్నిరకాల సౌకర్యాలు నేటి హీరోయిన్ కు ఆన్ సెట్స్ లో దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు ఈ సౌకర్యాలు ఏవీ లేవు. ఉన్న సదుపాయాలతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి. హీరోయిన్లు అయితే డ్రెస్ చేంజ్ చేసుకో వాలం టే చెట్టు వెనుకకు వెళ్లి మార్చికోవాల్సిన పరిస్థితి. 80-90 వ దశకంలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు సీనియర్ హీరోయిన్లగా చలామణి అవుతున్న వారంతా ఆ ఫేజ్ ని చూసిన వారే.
తాజాగా ఈ లిస్ట్ లో కాజోల్ కూడా మినహాయింపు కాదని వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శక, నిర్మాత కరణ్ జోహార్ రివీల్ చేసారు. షారుక్ ఖాన్-కాజోల్ జంటగా నటించిన `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆదిత్యా చోప్రా తెరకెక్కించారు. ఈ సినిమాకు కర్‌ణ జోహార్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసారు. ఈసినిమా షూటింగ్ స్టిట్జర్లాండ్ లో కొంత భాగం షూటింగ్ చేసారు.
ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కాజోల్ చాలా సందర్బాల్లో దుస్తులను చెట్టు వెనుకకు వెళ్లి మార్చుకుం దని కరణ్ తెలిపారు. `వ్యానిటీ వ్యాన్ అందుబాటులో ఉన్నా అందులో చాలా మంది ఉండే వారు. అడిగే పరిస్థితి ఉండేది కాదు. సినిమా షూటింగ్ సమయంలో కాజోల్ తల్లి కూడా వెంట ఉండేవారు. ఒక్కోసారి మ్యాకప్ మ్యాన్ అందుబాటులో లేకపోతే కాజోల్ జుట్టు నేనే సరిచేసేవాడిని. మ్యాకప్ కూడా వేసిన సంద ర్భాలెన్నో. అవన్నీ గొప్ప మధుర జ్ఞాపకాలు. ఇప్పుడవేవి లేకపోవడంతో బోర్ గా అనిపిస్తుంద`న్నారు.
