రామోజి ఫిల్మ్ సిటీపై మాట మార్చిన కాజోల్..!
అంతేకాదు తాను నటించిన ఎన్నో సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకున్నాయని అన్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 10:13 PM ISTబాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రామోజీ ఫిల్మ్ సిటీపై ఈమధ్య చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాజోల్ మా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఈవెంట్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసే టైం లో నెగిటివ్ వైబ్స్ వచ్చాయని ఆమె అన్నారు. కాజోల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆడియన్స్ నుంచి విపరీతమైన కామెంట్స్ ఎదుర్కొన్నారు.
ఐతే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ కాజోల్ తన కామెంట్స్ పై స్పందించారు. తన కొత్త సినిమా మా ను ప్రచారం చేసుకునే క్రమంలోనే అలా మాట్లాడానని అన్నారు. ఎక్స్ వేదికగా ఆర్.ఎఫ్.సీ పై తను చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు కాజోల్. తాను నటించిన మా సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగానే రామోజి ఫిల్మ్ సిటీ పై కామెంట్స్ చేశానని అన్నారు.
అంతేకాదు తాను నటించిన ఎన్నో సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకున్నాయని అన్నారు. కొన్నేళ్లుగా చాలాసార్లు అక్కడ ఆతిథ్యం పొందానని.. సినిమా మేకింగ్ కు అనువైన ప్లేస్ అక్కడ ఉంటుందని అన్నారు. ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి ఆస్వాదించడానికి అనువైన భద్రత గల ప్రదేశమని కాజోల్ అన్నారు.
ఐతే తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా సినిమాలు కూడా ఎన్నో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటాయి. అలాంటి ఆర్.ఎఫ్.సీ మీద కాజోల్ సంచలన వ్యాఖ్యలు చేయడంపై అందరు షాక్ అయ్యారు. ఐతే కాజోల్ తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలా కామెంట్ చేశానని క్లారిటీ ఇచ్చారు.
కాజోల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మా సినిమాను విశాల్ ఫురియా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కాజోల్ తో పాటు రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేనుగుప్తా నటించారు. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రాక్షసుడి నుంచి బిడ్డను కాపాడటానికి ఒక తల్లి కాళి దేవతగా ఎలా మారుతుంది అన్నది చూపించేలా మా సినిమా వస్తుంది. సినిమా టీజర్, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేసిన కాజోల్ ఇప్పుడు ప్రత్యేకమైన సినిమాలతో రాణించాలని చూస్తుంది. ఐతే మా మూవీ ప్రమోషన్స్ లో ఆర్.ఎఫ్.సీపై చేసిన కామెంట్స్ మాత్రం నెటిజెన్ల నుంచి విపరీతమైన ట్రోల్స్ ఫేస్ చేశారు. ఫైనల్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆ వ్యాఖ్యలు అంటూ సోషల్ మీడియాలో స్పందించారు కాజోల్.
