స్కూల్ నుంచి పారిపోయి దొరికిపోయా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తన చదువుకునే రోజుల్లో ఫేస్ చేసిన ఓ సాహసాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
By: Tupaki Desk | 7 July 2025 4:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తన చదువుకునే రోజుల్లో ఫేస్ చేసిన ఓ సాహసాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమ్మమ్మపై ఉండే ప్రేమ కాజోల్ ను ఓ సారి ఇరికించేసిందని ఆమె తెలిపారు. కాజోల్ కు తన అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమట. తాను బోర్డింగ్ స్కూల్ లో చదువుకునేటప్పుడు ఓ సారి తన అమ్మమ్మకు హెల్త్ బాలేదని తెలిసిందట.
దీంతో వెంటనే ఎలాగైనా అమ్మమ్మను చూడాలనుకున్నారట కాజోల్. కానీ తన తల్లికి ఫోన్ చేస్తే ఎగ్జామ్స్ ఉన్నాయని ఇంటికి రావొద్దని చెప్పారట. డిసెంబర్ లో సెలవులిస్తారులే అప్పుడు ఇంటికి రావొచ్చన్నారని, కానీ తనకు అమ్మమ్మ ఆరోగ్యం గురించి తెలిశాక అక్కడ అస్సలు ఉండబుద్ధి కాలేదని, అప్పటికే తన ఫ్రెండ్ కూడా ఏదో బాధలో ఉండటంతో ఇద్దరం కలిసి స్కూల్ నుంచి పారిపోయి ముంబై వెళ్లాలని డిసైడైనట్టు చెప్పారు.
అలా స్కూల్ నుంచి పారిపోయి బయటకు వచ్చిన తాను అదే టౌన్ లో ఉన్న తన మామయ్యను కలిసి అమ్మ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది, బస్టాండ్ కు తీసుకెళ్లమని అడిగానని, తను చెప్పింది నమ్మి ఆయన బస్టాప్ కు తీసుకెళ్లగా అక్కడ ప్లాన్ మొత్తం బెడిసి కొట్టిందని, బస్టాండ్ కు వెళ్లేసరికి స్కూల్ లో వర్క్ చేసే నన్స్, తనను, తన ఫ్రెండ్ ను వెతుక్కుంటూ వచ్చి చెవులు మెలిపెట్టి మరీ మళ్లీ స్కూల్ కు తీసుకెళ్లారని కాజోల్ ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టారు.
అయితే కాజోల్ చదువుకునే స్కూల్ పంచంగి లో ఉంటే, తన ఇల్లు ముంబైలో ఉంది. పంచంగి నుంచి ముంబై వెళ్లాలంటే ఎంతలేదన్నా ఐదు గంటల టైమ్ పడుతుందట. తన అమ్మమ్మకు బాలేదని తెలియడంతో ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలనుకున్నానని, అప్పుడు తన వయసు 11 ఏళ్లేనని ఆమె పేర్కొన్నారు. కాగా కాజోల్ నటించిన తాజా సినిమా మా రీసెంట్ గానే రిలీజైంది.
