Begin typing your search above and press return to search.

కాజల్ 'సత్యభామ'.. మౌత్ టాక్ తోనే!

By:  Tupaki Desk   |   9 Jun 2024 4:15 PM GMT
కాజల్ సత్యభామ.. మౌత్ టాక్ తోనే!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది భగవంత్ కేసరిలో యాక్ట్ చేసిన కాజల్.. రీసెంట్ గా సత్యభామ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ గా సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ మూవీతోనే సుమన్ చిక్కాల తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

సత్యభామ మూవీకి గాను డైరెక్టర్ సుమన్ చిక్కాల సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. క‌థ‌లోని ట్విస్ట్ బాగుందని తెలిపారు. ఇక ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజల్ తన యాక్టింగ్ తో అదరగొట్టేసిందని అనేక మంది రివ్యూలు ఇచ్చారు. ఈ మూవీ కోసం టాలీవుడ్ చందమామ బాగా కష్టపడిందని కొనియాడారు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా కాజల్ బాగా యాక్ట్ చేసిందని తెలిపారు.

అయితే ఈ సినిమా వల్ల షీ సేఫ్ యాప్ ను మూడు రోజుల్లో 7వేల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నట్లు ఇటీవల మేకర్స్ తెలిపారు. తాజాగా ఈ మూవీ తొలి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టినట్లు అనౌన్స్ చేశారు. మూడో రోజు ఆదివారం కావడంతో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. మొత్తానికి యాక్షన్ ప్యాక్డ్ మూవీ సత్యభామ.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

ఇదే కంటిన్యూ అయితే.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకోవడం ఈజీ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తోపాటు న‌వీన్‌ చంద్ర‌, ప్ర‌కాష్‌ రాజ్, ప్ర‌జ్వ‌ల్ యాద్మ, రవి వర్మ, నాగనీడు కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. శ్రీనివాసరావు తక్కళ్లపల్లి, బాబీ తిక్క సంయుక్తంగా నిర్మించారు. గూఢ‌చారి ఫేమ్ శ‌శికిర‌ణ్ తిక్కా స్క్రీన్‌ ప్లే అందిస్తూ ప్ర‌జెంట‌ర్‌ గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. సత్యభామ ఓటీటీ రైట్స్ ను ఆహా ప్లాట్ ఫామ్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల త‌ర్వాత స‌త్య‌భామ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాను మీరు థియేటర్లలో చూశారా? లేదా?