Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసమే అది చేశా.. సత్యభామ స్పెషల్ ఎందుకంటే..?

శశి కిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది కాజల్.

By:  Tupaki Desk   |   15 May 2024 6:20 AM GMT
ఎన్టీఆర్ కోసమే అది చేశా.. సత్యభామ స్పెషల్ ఎందుకంటే..?
X

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ తెలుగులో ఉన్న స్టార్స్ అందరితో కలిసి నటించారు. లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ తన పంథా మార్చాలని అనుకున్న అమ్మడు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో సత్యభామ అంటూ ఒక క్రేజీ అటెంప్ట్ చేసింది. శశి కిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది కాజల్.

కాజల్ కు తన పేరు ఆమె తాతయ్య పెట్టారట.. ముంబై లో పుట్టి పెరిగిన తను తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డానని చెబుతుంది. అయితే ఇప్పుడు తనకు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అయ్యిందని అంటుంది కాజల్. మొదటి సినిమా హిందీలో చేసినా సరే తొలి సినిమా రిలీజైంది మాత్రం తెలుగులోనే అని చెప్పింది కాజల్. లక్ష్మి కళ్యాణం సినిమాతో తన ఫస్ట్ సినిమా రిలీజైందని చెప్పుకొచ్చింది.

లక్ష్మి కళ్యాణం ఆఫర్ గురించి వివరిస్తూ.. డైరెక్టర్ తేజ నా ఫోటోలు చూసి ఆడిషన్స్ కు పిలిచారు. ఆయన ఒకసారి ఏడవండి అని అంటే తన లైఫ్ లో అప్పటివరకు ఏడవని తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏడుపు రాలేదని.. అయితే ఆ టైం లో నాన్న సాయంతో ఏదో చెప్పడం వల్ల ఏడుపు వచ్చింది. అలా కన్నీళ్లతో డైలాగ్ చెప్పానని అన్నారు కాజల్. తేజ హీరోయిన్స్ మీద సీరియస్ అవుతాడన్న టాక్ ఉంది. ఐతే తన మీద మాత్రం అంతగా సీరియస్ కాలేదని చెప్పుకొచ్చారు కాజల్. సెట్ లో తన మీద అరిస్తే తాను కూడా అరిచేదాన్ని కొద్దిసేపు మాట్లాడకుండా ఉండి మళ్లీ తర్వాత అంతా సెట్ అయ్యేదని అన్నారు. తేజ డైరెక్షన్ లో లక్ష్మి కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, సీత మూడు సినిమాల్లో నటించానని చెప్పారు కాజల్.

ఇక తను నటించిన సత్యభామ గురించి చెప్పిన కాజల్. సినిమాలో పోలీస్ పాత్రలో నటించా.. చాలా ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. కథ చెప్పిన వెంటనే నచ్చి ఓకే చేశానని అన్నారు కాజల్. ఇక తన మ్యారేజ్ గురించి ప్రస్తావిస్తూ.. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని అన్నారు. 10 ఏళ్ల స్నేహితులుగా ఉన్నా కరోనా టైం లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నామని అన్నారు కాజల్.

తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడ సంప్రదాయాల మీద గౌరవం పెరిగిందని. అందుకే తన పెళ్లిలో కూడా మన సంప్రదాయం పాటించామని అన్నారు. తెలియకుండానే సినిమాల్లో ఎన్నో ఫేక్ పెళ్లిల్లు చేశారు. అందుకే నిజం పెళ్లి కూడా అదే సంప్రదాయంలో చేసుకున్నానని అన్నారు కాజల్.

సత్య భామ స్పెషల్ మూవీ అంటున్నారు కాజల్. ఇప్పటివరకు తాను అన్ని జోనర్ల సినిమాల్లో నటించా.. కానీ మహిళా ప్రాధాన్యత సినిమా చేయాలని అనిపించింది. అందుకే ఈ సినిమాకు ఓకే చెప్పానని అన్నారు కాజల్. కాలేజీ రోజుల్లో తనకు ఎంతోమంది లవ్ లెటర్స్ రాసేవారని చెప్పుకొచ్చిన కాజల్. ఒక అబ్బాయి రాసిన లవ్ లెటర్ బాగా నచ్చింది. తనకే కాదు అమ్మకి కూడా తన మీద అతను రాసిన కవిత నచ్చడంతో ఆ లెటర్ దాచి పెట్టిందని అన్నారు కాజల్.

జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ కెరీర్ లో ఫస్ట్ టైం స్పెషల్ ఐటెం సాంగ్ చేసింది. దాని వెనుక ఉన్న కారణాలు చెప్పుకొచ్చారు కాజల్. ఆ సాంగ్ కేవలం ఎన్టీఆర్ కోసం చేశానని ఆ సాంగ్ తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని అన్నారు. తనకు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా ఇప్పటికీ పాటిస్తున్నానని చెప్పారు కాజల్. కెమెరా ఆఫ్ చేశాక కూడా కొద్దిసేపు ఎమోషనల్ లోనే ఉండాలని బన్నీ చెప్పాడు. ఎడిటింగ్ టైం లో అది అవసరపడుతుందహ్ని చెప్పాడు. నిజంగానే అది ఎంతో హెల్ప్ చేసిందని అన్నారు కాజల్. రాజమౌళి లాంటి దర్శకులతో పనిచేయడం గొప్ప అనుభూతి.. ఆయన విజన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆయనతో పనిచేశాకనే ఏదైనా సాధ్యమని అర్థమైందని అన్నారు.