Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ లో కొత్త మార్పుకు నేను సాక్ష్యం : కాజల్‌

పెళ్లి తర్వాత కెరీర్ లో ఇన్ని ఆఫర్లు అందుకుంటాను అనుకోలేదు అంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన కాజల్‌ అగర్వాల్‌ తాజా ఇంటర్వ్యూలో టాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   20 May 2024 5:39 AM GMT
టాలీవుడ్‌ లో కొత్త మార్పుకు నేను సాక్ష్యం : కాజల్‌
X

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త చిన్న గ్యాప్ తీసుకుని వెంటనే రీ ఎంట్రీ ఇచ్చింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. తాజాగా కాజల్ అగర్వాల్‌ నటించిన సత్యభామ సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్న సత్యభామ సినిమా ను కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మే 31న విడుదల అవ్వబోతున్న సత్యభామ సినిమా ప్రమోషన్ లో భాగంగా కాజల్‌ అగర్వాల్ గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు రెగ్యులర్‌ గా వస్తూనే ఉంది.

మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను కాజల్‌ అగర్వాల్‌ షేర్‌ చేసుకుంటూ ఉంది. పెళ్లి తర్వాత కెరీర్ లో ఇన్ని ఆఫర్లు అందుకుంటాను అనుకోలేదు అంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన కాజల్‌ అగర్వాల్‌ తాజా ఇంటర్వ్యూలో టాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్‌ తో పోల్చితే టాలీవుడ్‌ లో గతంలో పెళ్లి అయిన హీరోయిన్స్ కు చాలా తక్కువ అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెళ్లి తో సంబంధం లేకుండా, నటి వ్యక్తిగత విషయాలతో పట్టింపు లేకుండా సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.

టాలీవుడ్‌ లో మారిన పరిస్థితులకు నేను ప్రత్యక్ష సాక్షిని అంటూ కాజల్‌ అగర్వాల్‌ చెప్పుకొచ్చింది. సత్యభామ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలను కూడా నేను తెలుగు లో చేస్తున్నాను అంది. ముందు ముందు టాలీవుడ్‌ లో నేను మరిన్ని సినిమాలు చేయబోతున్నాను. అంతే కాకుండా నాలాగే మరి కొందరు పెళ్లి అయిన తర్వాత కూడా ముందు ముందు మంచి ఆఫర్లు సొంతం చేసుకుంటారు అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది.