Begin typing your search above and press return to search.

అక్కా-చెల్లిలా రాశీతో చంద‌మామ‌!

అందాల బ్యూటీలు రాఖీఖ‌న్నా-కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒకే చోట క‌లిస్తే? లేడీ ఫాలోవ‌ర్స్ కి ఆ కిక్కే వేరుగా. స‌రిగ్గా అలాంటి స‌న్నివేశ‌మే ఇది.

By:  Tupaki Desk   |   15 Oct 2023 1:50 PM GMT
అక్కా-చెల్లిలా రాశీతో చంద‌మామ‌!
X

అందాల బ్యూటీలు రాఖీఖ‌న్నా-కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒకే చోట క‌లిస్తే? లేడీ ఫాలోవ‌ర్స్ కి ఆ కిక్కే వేరుగా. స‌రిగ్గా అలాంటి స‌న్నివేశ‌మే ఇది. ఇదిగో ఇక్క‌డిలో రాశీఖ‌న్నా-కాజ‌ల్ జంట‌గా సెల్పీలు దిగారు. వారిద్ద‌రి మ‌ధ్య‌లో కాజ‌ల్ గారాల కుమారుడు కూడా తోడ‌య్యాడు. భామామ‌ణులిద్ద‌రు క్యాజువ‌ల్ గా షేర్ చేసుకున్న పిక్ ఇది. ఇద్ద‌రు సింపుల్ దుస్తుల్లో ఉన్నారు. అనుకోకుండా చోటు చేసుకున్న స్పాట్ లా ఉంది.

ఇద్ద‌రు అక్కా-చెల్లిలా చాలా క్లోజ్ గా ఈ పిక్ లో క‌నిపిస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు వాలిపోయి మ‌రీ ఫోజులి చ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇద్ద‌రు ఇలా క‌లిసి ఫోటో దిగిన స‌న్నివేశం ఇంత‌వ‌ర‌కూ చోటు చేసుకోలేదు. దీంతో హీరోయిన్ల ఇద్ద‌రి అభిమానులు అక్కా-చెల్లి లా ఉన్నారంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇక కెరీర్ ప‌రంగా చూస్తే ఇద్ద‌రు బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపో తుంది. తెలుగు లో మంచి అవ‌కాశాలు అందుకుంటుంది. సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ గా నిలుస్తుం ది. బాల‌య్య‌తో న‌టించిన భ‌గంవ‌త్ కేస‌రి త్వ‌ర‌లో రిలీజ్ అవుతుంది. ఇది హిట్ అయితే కాజ‌ల్ కి మైలేజ్ రెట్టింపు అవుతుంది. కొత్త అవ‌కాశాలు మ‌రిన్ని వ‌రిస్తాయి. `ఇండియ‌న్ -2`లోనూ న‌టిస్తుంది. ఇదే కాజ‌ల్ తొలిపాన్ ఇండియా చిత్రం. హిందీలో కొన్ని సినిమాలు చేసింది గానీ అక్క‌డ ఆశించినంత‌గా కెరీర్ సాగ‌లేదు.

ఇక రాశీఖ‌న్నా కోలీవుడ్ లో బిజీ అవుతుంది. తెలుగు అవ‌కాశాలు త‌గ్గ‌డంతో అమ్మ‌డు రెండేళ్ల‌గా అక్క‌డే ఎక్కువ సినిమాలు చేస్తోంది. హిందీలోనూ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అయితే అక్క‌డంత సీరియ‌స్ గా ముందుకెళ్ల‌లేదు. త‌మిళ్ నే మెయిన్ టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అక్క‌డ అభిరుచికి త‌గ్గ‌ట్టు మౌల్డ్ చేసుకుంటుంది. లుక్ ప‌రంగానూ కొన్ని ర‌కాల మార్పులు తీసుకొస్తుంది.