Begin typing your search above and press return to search.

కన్నప్పలో చందమామ కూడా..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై అంచనాలు రోజురోజుకు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నాయి

By:  Tupaki Desk   |   17 May 2024 12:26 PM GMT
కన్నప్పలో చందమామ కూడా..
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై అంచనాలు రోజురోజుకు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. అందుకు ముఖ్య కారణం క్యాస్టింగ్ అని చెప్పవచ్చు. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నార్త్‌ నుంచి సౌత్‌ వరకు పలువురు స్టార్స్‌ భాగమవుతున్నారు. అక్షయ్‌ కుమార్‌, ప్రభాస్‌, మోహన్ లాల్, శివరాజ్‌ కుమార్‌ తోపాటు చాలా మంది అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దీంతో కన్నప్ప చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వరుస అప్డేట్స్ వస్తుండడంతో కన్నప్ప ప్రాజెక్ట్ ట్రెండింగ్ లోనే ఉంటోంది. ఇటీవల అక్షయ్ షూటింగ్ పూర్తవ్వడం, ఆ తర్వాత ప్రభాస్ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం, టీజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం.. ఇలా అప్డేట్స్ తో కన్నప్ప కోసం చర్చ జరుగుతూనే ఉంది. తాజా కన్నప్ప మూవీ మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలో పార్వతి పాత్రలో స్టార్ హీరోయిన్ నయనతార కనిపించనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆమె నటించడం లేదని తెలిసింది. ఆమె ప్లేస్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు కన్నప్ప చిత్రంలో కాజల్ కీలక పాత్ర పోషిస్తుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఆమె ఏ పాత్రలో కనిపిస్తుందన్న విషయం మాత్రం బయటపెట్టలేదు.

ఇప్పటికే మంచు విష్ణుతో కాజల్.. మోసగాళ్లు సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ మూవీలో విష్ణు, కాజల్ అన్నాచెల్లెళ్లుగా నటించారు. రూ.50 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఇప్పుడు కాజల్ మరోసారి మంచు విష్ణుతో కలిసి కన్నప్ప చిత్రంలో నటిస్తోంది. ఆమె రోల్ పై పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు. దీంతో కాజల్ అగర్వాల్ కన్నప్ప సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హిందీ మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలు మరింత పెంచనున్నారు మేకర్స్. మే 20వ తేదీన కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ లాంఛ్ చేయనున్నారు. 2024లోనే విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.