Begin typing your search above and press return to search.

చందమామ వాలంటైన్‌ స్పెషల్ పిక్‌

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా సోషల్‌ మీడియా ద్వారా తెగ సందడి చేస్తోంది

By:  Tupaki Desk   |   15 Feb 2024 6:46 AM GMT
చందమామ వాలంటైన్‌ స్పెషల్ పిక్‌
X

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా సోషల్‌ మీడియా ద్వారా తెగ సందడి చేస్తోంది. ఆ మధ్య బాబుకు జన్మనిచ్చిన తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న ఈ అమ్మడు మళ్లీ నటనతో బిజీ అయిన విషయం తెల్సిందే. గతంతో పోల్చితే ఏ మాత్రం ఉత్సాహం తగ్గకుండా తన జోరు కంటిన్యూ చేస్తుంది.


అందాల కాజల్‌ అగర్వాల్‌ తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా స్పెషల్‌ ఫోటోలను షేర్‌ చేసింది. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొడుకు తో ఉన్న ఫోటోలను షేర్ చేసి తన స్పెషల్‌ వాలంటైన్ అంటూ కామెంట్‌ పెట్టింది. నైల్‌ కిచ్లు అందమైన ఫోటోలను కాజల్ షేర్‌ చేసింది.

కొడుకు ఫోటో మాత్రమే కాకుండా భర్త తో ఉన్న ఫోటోను కూడా కాజల్ అగర్వాల్‌ ఈ ప్రత్యేకమైన రోజున షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన కాజల్ అగర్వాల్ తన భర్త మరియు కొడుకు తో తన ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్‌ చేసుకుని ఆ పోటోలు షేర్‌ చేసి ఫ్యాన్స్ తో ఆనందాన్ని పంచుకుంది.

ఇక కాజల్ అగర్వాల్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెటిజన్స్ పలువురు ఆమెకు కామెంట్స్ తో శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దశాబ్దాలు కావస్తున్నా కూడా కాజల్ అగర్వాల్‌ జోరు తగ్గలేదు.. అలాగే ఆమె అందం కూడా ఏమాత్రం తగ్గలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.