భర్తతో కాజల్ అగర్వాల్ పైనాన్షినయల్ డిస్కషన్స్!
ఈ నేపథ్యంలో సంపాదన వ్యత్యాస అంశం కాజల్ ముందుకెళ్లింది? ఈ విషయంలో తాను భర్తతో ఎంతో జాగ్రత్తగా ఉంటానంది.
By: Tupaki Desk | 8 Jun 2025 5:00 PM ISTహీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను దక్కించుకుంది. కెరీర్ లో అవకాశాలు తగ్గని దశలో వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. అలాగని సినిమాలకు దూరం కాలేదు. బిడ్డకు తల్లైన తర్వాత కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. అయితే మునుపటిలా ఛాన్సులు అందుకోలేకపోతుంది.
రెండేళ్ల క్రితం వరకూ యాక్టివ్ గానే కనిపించింది. కానీ ఇప్పుడిప్పుడే అవకాశాలకు దూరమవుతుంది. నటిగా కాజల్ కూడా బాగానే సంపాదించింది. వచ్చిన డబ్బుతో వ్యాపారాలు చేసింది. అక్కడా సక్సెస్ అయింది. అటు భర్త గౌతమ్ కూడా ఈ కామర్స్ రంగలో దిగ్విజయంగా కొనసాగుతున్నాడు. అయితే భర్త ఆస్తి కంటే కాజల్ ఆస్తి ఎక్కువ అన్న విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో సంపాదన వ్యత్యాస అంశం కాజల్ ముందుకెళ్లింది? ఈ విషయంలో తాను భర్తతో ఎంతో జాగ్రత్తగా ఉంటానంది. ఇద్దరి మధ్య వ్యాపారాలు గానీ, డబ్బుకు సంబంధించిన ఇతర విషయాలేవి రాకుం డా చూసుకుంటుందిట. ఇద్దరు కలిసిన సమయంలో కుటుంబానికి సంబంధించిన టాపిక్స్ తప్ప డబ్బు అనే అంశాన్ని మాత్రం రానివ్వనని కాజల్ తెలిపింది. డబ్బే అన్ని సమస్యలు తెచ్చి పెడుతుంది.
భార్య భర్తలిద్దరు సమాన హక్కులు అనే అంశం తెరపైకి వస్తే అన్ని చిక్కులే. ఈ విషయంలో కాజల్ ఎంతో బ్యాలెన్స్ గా ముందుకెళ్తుంది. నటిగా బిజీగా ఉన్న సమయంలో కాజల్ కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించేది. బిడ్డ ఆలనా, పాలనా దగ్గరుండి చూసుకునేది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కన్నప్ప, రామాయణ్ చిత్రాల్లో నటిస్తోంది.
