కాజల్ వెయిటింగ్ ఫర్ ఏ ఛాన్స్..?
ఐతే కాజల్ విషయంలో మాత్రం తను సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా సరైన ఛాన్స్ లు రావట్లేదు.
By: Tupaki Desk | 5 Jun 2025 8:00 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీ అయ్యింది. పెళ్లైన భామలకు అవకాశాలు తక్కువగా వస్తాయి. ఐతే పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్స్ గా దూసుకెళ్లిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలైతే పెళ్లై పిల్లలు ఉన్నా కూడా ఎక్కడ వెనక్కి తగ్గినట్టు అనిపించరు. ఐతే వాళ్లు అక్కడ పెళ్లైనా గ్లామర్ షో విషయంలో కూడా లిమిట్స్ పెట్టుకోరు. మన దగ్గర ఆ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టే కాస్త వెనుకబడతారు.
ఐతే కాజల్ విషయంలో మాత్రం తను సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా సరైన ఛాన్స్ లు రావట్లేదు. తెలుగులో అమ్మడు టాప్ హీరోయిన్ గా దాదాపు మన స్టార్స్ అందరితో చేసింది కానీ ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ పెద్దగా అవకాశాలు రావట్లేదు. మంచు విష్ణు తో ఒక సినిమా, బాలయ్యతో ఒక అవకాశం వచ్చినా అవేవి అమ్మడికి ప్లస్ అవ్వలేదు. సత్యభామ అంటూ ఫిమేల్ సెంట్రిక్ సినిమా కూడా చేసిన కాజల్ ఆ సినిమా వల్ల కూడా ఎలాంటి ఉపయోగం కలగలేదు.
అటు కోలీవుడ్ లో కూడా అమ్మడి పరిస్థితి అలానే ఉంది. ఐతే మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ఒక రోల్ ఇచ్చాడు. అటు బాలీవుడ్ రామాయణ్ లో కూడా ఒక పాత్ర చేస్తుంది. ఇలానే వచ్చిన పాత్ర చాలని అనుకుంటే మాత్రం కాజల్ ఇక హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేయాల్సి వస్తుంది. అందుకే కాజల్ ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ రావడం అంటూ జరిగితే మళ్లీ తిరిగి అమ్మడు ఫాం లోకి రావాలని అనుకుంటుంది.
కాజల్ కాస్త ట్రై చేయాలే కానీ అలాంటి అవకాశం తెలుగు నుంచి వస్తుందని చెప్పొచ్చు. ఎలాగు అమ్మడికి ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడే కాజల్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకుంది. సో టాలీవుడ్ నుంచే అమ్మడికి ఒక లక్కీ ఆఫర్ రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే ఛాన్స్ లు రావట్లేదు కదా అని సైలెంట్ అవ్వకుండా తన ప్రయత్నంగా ఫోటో షూట్స్ ఇంకా ఆడియన్స్ కి టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తే బెటర్ అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.
