Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : మదర్ డ్యూటీలో కాజల్‌ అగర్వాల్‌

ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయిన పెళ్లి అయిన తర్వాత భార్యగా కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   27 May 2025 3:34 PM IST
పిక్‌టాక్ : మదర్ డ్యూటీలో కాజల్‌ అగర్వాల్‌
X

ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయిన పెళ్లి అయిన తర్వాత భార్యగా కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే హీరోలు కూడా కచ్చితంగా భర్తలుగా బాధ్యతలు నెత్తిన వేసుకోవాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్స్‌ తల్లిగా మారితే అందరు తల్లుల మాదిరిగానే మదర్‌ డ్యూటీని నిర్వర్తించాల్సిందే. స్టార్‌ హీరోయిన్స్‌ అయినా, అంతకు మించిన వారు అయినా కూడా తల్లిగా ప్రతి ఒక్కరూ బిడ్డకు అమ్మతనం చాటుతూ ఉంటారు. ఒక్కరు ఇద్దరు మాత్రం తల్లితనం మరచి పోతూ ఉంటారు. ఆయాల వద్ద పిల్లలను ఉంచడం ద్వారా అమ్మగా విధులు నిర్వర్తించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కాజల్‌ అగర్వాల్‌ మాత్రం అలా కాదు.


టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు, గౌరవం దక్కించుకున్న ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. ఇండస్ట్రీలో ఎంతో పేరున్న కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత తన పేరును మార్చుకోవడంతో పాటు చాలా విషయాలను మార్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక మొదలుకుని అన్ని విధాలుగా హుందాగా వ్యవహరించడం, ఒక వివాహితగా బాధ్యతాయుతంగా వ్యవహరించడంను చూడవచ్చు. కాజల్‌ అగర్వాల్‌ సహజంగానే సున్నిత మనస్కురాలు అంటూ ఉంటారు. కాజల్ అగర్వాల్‌ తల్లి అయినప్పటి నుంచి కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ ఉన్న విషయం తెల్సిందే. కొడుకును తాను ఎక్కడికి వెళ్లినా తీసుకు వెళ్తూ ఉంటుంది.


ప్రస్తుతం ఈ సమ్మర్‌ సీజన్‌లో కాజల్‌ తన కొడుకు నీల్ కిచ్లు కు స్విమ్మింగ్‌తో పాటు సైక్లింగ్‌ను నేర్పిస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. స్విమ్మింగ్‌ పూల్‌లో నీల్ కిచ్లు స్విమ్‌ చేస్తూ ఉండగా బికినీ ధరించిన కాజల్‌ అగర్వాల్‌ అతడికి హెల్ప్‌గా నిలిచింది. అంతే కాకుండా సైకిల్‌ తొక్కుతున్న సమయంలో వెనుక జాగ్రత్తగా పట్టుకున్న ఫోటోలు కూడా కాజల్‌ షేర్ చేసింది. మొత్తానికి ఈ సమ్మర్‌లో కాజల్‌ అగర్వాల్‌ తన మదర్‌ డ్యూటీని నిర్వర్తిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కొడుకుతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా మరింతగా ఫాలోవర్స్‌ను కాజల్‌ అగర్వాల్‌ సొంతం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా హీరోయిన్‌గా సినిమాలు చేసింది, ఇప్పటికీ చేసేందుకు రెడీగా ఉంది. కాజల్‌ నటించిన కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమాలో గెస్ట్‌ పాత్రలోనే కాజల్‌ అగర్వాల్‌ నటించిన విషయం తెల్సిందే. కన్నప్ప సినిమాతో పాటు కాజల్ పలు ప్రాజెక్ట్‌ల్లో హీరోయిన్‌గా లేదంటే ముఖ్య పాత్రల్లో నటిస్తూ వచ్చింది. ముందు ముందు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అక్కగా, అమ్మగా నటిస్తే కచ్చితంగా మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మరి కాజల్‌ అలా నటించేందుకు సిద్దమేనా చూడాలి. హీరోయిన్‌గానే మరికొన్నాళ్లు కాజల్‌ కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.