చందమామ కాజల్‌తో ఎవరు ఈ అతిథి?
బిజినెస్‌మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 May 2025 3:42 PM ISTబిజినెస్‌మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన వారసుడు జూనియర్ కిచ్లు (నీల్ కిచ్లు) ఆలనా పాలనా చూసుకోవడానికే సమయం సరిపోవడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ ప్రతిష్టాత్మక `రామాయణం` సినిమాలో రావణాసురుడి భార్య మండోదరిగా నటిస్తోంది అంటూ ప్రచారం సాగింది. రణబీర్- నితీష్ కుమార్ మూవీలో నటించనుందని కథనాలొచ్చాయి. అయితే దీనికి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మే షన్ లేదు.
ప్రస్తుతానికి కాజల్ తన వ్యక్తిగత జీవితంపైనే దృష్టి సారించింది. తాజాగా విమానాశ్రయంలో తన కుమారుడు నీల్ తో కలిసి వెళుతున్నప్పటి ఒక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. కార్ లో ఫోటోగ్రాఫర్లకు హాయ్ చెబుతూ కుమారుడి చెంతనే కాజల్ కనిపించింది. కొంత గ్యాప్ తర్వాత ఇల్లు విడిచి ఇలా విమానాశ్రయంలో ప్రత్యక్షమైన కాజల్ ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు.
కాజల్ సౌత్- నార్త్ రెండు చోట్లా పాపులర్ హీరోయిన్. కెరీర్ బెస్ట్ ఫేజ్ లో పెళ్లితో లైఫ్ లో సెటిలైంది. బెబో కరీనా, కాజోల్, మాధురి ధీక్షిత్ తరహాలో కాజల్ అగర్వాల్ రీఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కాజల్ తిరిగి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే టాలీవుడ్ గ్రాండ్ వెల్ కం చెబుతుంది. ఇక ప్రభాస్, మహేష్ తర్వాత సింగపూర్ మ్యాడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం కలిగి ఉన్న ఏకైక నటి కాజల్ అగర్వాల్ అన్న సంగతి తెలిసిందే. ఈ మైనపు విగ్రహాన్ని తమ అభిమాన తార కాజల్ గౌరవం, హుందాతనం, స్టాటస్ కి సింబల్ గా అభిమానులు భావిస్తున్నారు.
