Begin typing your search above and press return to search.

కాజల్‌ ఇంకా ఎంత కష్ట పడుతుందో చూడండి..!

కాజల్‌ అగర్వాల్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ అదే అందం ను మెయింటెన్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   22 July 2025 4:18 PM IST
కాజల్‌ ఇంకా ఎంత కష్ట పడుతుందో చూడండి..!
X

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. హీరోయిన్‌గా గతంలో మాదిరిగా బిజీగా లేని కాజల్‌ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇటీవల కన్నప్ప సినిమాలో కనిపించిన కాజల్‌ అగర్వాల్‌ అందం ఏమాత్రం తగ్గలేదని, గతంలో ఎంత అందంగా ఉందో అంతే అందంగా కాజల్ అగర్వాల్‌ ఉంది కనుక ఈమెకు యంగ్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా ఆఫర్లు దక్కితే బాగుండు అని చాలా మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కనీసం సీనియర్‌ హీరోలు అయినా కాజల్‌కి ఆఫర్లు ఇవ్వక పోవడం విడ్డూరంగా ఉందని, ఇది చాలా దారుణం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కాజల్‌ అగర్వాల్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ అదే అందం ను మెయింటెన్ చేస్తుంది. అందుకు కాజల్‌ అగర్వాల్‌ చాలా కష్టపడుతూ ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు. నిజంగానే సినిమాలు ఉన్నా.. లేకున్నా, ఆఫర్లు వచ్చినా.. రాకున్నా కూడా కాజల్‌ అగర్వాల్‌ వర్కౌట్‌లు చేయడం మానదు. ఆమె నుంచి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు వచ్చినప్పుడు ఎంతగా వర్కౌట్స్ చేస్తూ ఉండేదో ఇప్పటికి కూడా కాజల్ అగర్వాల్‌ అదే స్థాయిలో వర్కౌట్‌లు చేస్తూనే ఉంది. అందమైన కాజల్‌ అగర్వాల్‌ మరింత అందంగా కనిపించడం కోసం రెగ్యులర్‌గా వర్కౌట్‌లను చేయడం మనం చూస్తూ ఉంటాం.


తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో తన వర్కౌట్‌ వీడియోను షేర్‌ చేసింది. తద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ సమయంలోనే కాజల్‌ అగర్వాల్‌ ఎంతో మంది స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన ఘనత దక్కించుకుంది. అందంతో పాటు, నటనతో, యాక్షన్‌ సీన్స్‌తోనూ మెప్పించిన ఘనత కాజల్‌ అగర్వాల్‌ది అనడంలో సందేహం లేదు. అందుకే కాజల్‌ అగర్వాల్‌ అప్పుడు మాత్రమే కాకుండా ఇప్పటికీ చాలా అందంగా, మంచి ఫిజిక్‌తో కనిపిస్తోంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు అంటూ ఉంటారు. ఇంతగా కష్టపడుతూ ఉంటే అందంగా ఉండరా అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తు ఉన్నారు.

కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి అయ్యి తల్లి అయిన తర్వాత కూడా సినిమాలు చేయాలని ఆశ పడుతుంది. అందుకు తగ్గట్లుగా తన ఫిజిక్‌ను మెయింటెన్‌ చేస్తూ వస్తుంది. అందం తగ్గలేదు కానీ గతంలో మాదిరిగా లక్ కలిసి రాకపోవడంతో కాజల్ అగర్వాల్‌ సినిమాలు చేయడం లేదు. గతంలో ఈమె చేసిన సినిమాల గురించి అభిమానులు, నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. కానీ కొత్త ఆఫర్లు మాత్రం కాజల్ అగర్వాల్‌ దక్కించుకోవడంలో విఫలం అవుతుంది. కాజల్‌ అగర్వాల్‌ చేస్తే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే ఒక మంచి పేరును సొంతం చేసుకున్న కాజల్‌ అగర్వాల్‌ ముందు ముందు అయినా మళ్లీ బిజీ హీరోయిన్‌గా నిలుస్తుందేమో చూడాలి.