Begin typing your search above and press return to search.

ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో చంద‌మామ‌

టాలీవుడ్ చంద‌మామ రీసెంట్ గానే త‌న 40వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంది. ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగిన కాజ‌ల్, ఫామ్ లో ఉన్న‌ప్పుడే త‌న ప్రియుడు గౌత‌మ్ కిచ్లూని పెళ్లి చేసుకుని, త‌ర్వాత ఓ బాబుని కని కొన్నాళ్ల పాటూ సినిమాల‌కు దూర‌మైంది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 1:23 PM IST
ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో చంద‌మామ‌
X

టాలీవుడ్ చంద‌మామ రీసెంట్ గానే త‌న 40వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంది. ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగిన కాజ‌ల్, ఫామ్ లో ఉన్న‌ప్పుడే త‌న ప్రియుడు గౌత‌మ్ కిచ్లూని పెళ్లి చేసుకుని, త‌ర్వాత ఓ బాబుని కని కొన్నాళ్ల పాటూ సినిమాల‌కు దూర‌మైంది. బాబు పుట్టాక కొన్నాళ్లకు మ‌ళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాల్లో న‌టిస్తోంది.


అయితే రీఎంట్రీ త‌ర్వాత కాజ‌ల్ కు కోరుకున్న హిట్, స్టార్‌డ‌మ్ ద‌క్క‌డం లేదు. చివ‌రిసారిగా స‌ల్మాన్ ఖాన్ సికంద‌ర్ సినిమాలో క‌నిపించిన కాజ‌ల్ ఆ సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించింది. సికందర్ లో కాజ‌ల్ పాత్ర చిన్న‌దైన‌ప్ప‌టికీ అందులో ఆమె న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అయిన‌ప్ప‌టికీ సికంద‌ర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ అవ‌క‌పోవ‌డంతో ఆ సినిమా కూడా కాజ‌ల్ కు పెద్ద‌గా క‌లిసి రాలేదు.


జూన్ 19వ తేదీన 40వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టిన కాజ‌ల్ కు త‌న ఫ్యాన్స్ తో పాటూ ప‌లువురు సెల‌బ్రిటీల నుంచి బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. అయితే కాజ‌ల్ ఈసారి త‌న బ‌ర్త్ డే ను మ‌రింత స్పెష‌ల్ గా మాల్దీవ్స్ లో సెలబ్రేట్ చేసుకోగా, దానికి సంబంధించిన ఫోటోలను కాస్త ఆల‌స్యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో కాజ‌ల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూ, కొడుకు నీల్ కిచ్లూ తో పాటూ కాజ‌ల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ కూడా క‌నిపించింది.


కాజ‌ల్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే త‌న 40వ పుట్టిన‌రోజున త‌న‌కు ఇష్ట‌మైన వారితో బీచ్ ఒడ్డున ఎంతో ప్ర‌శాంతంగా గ‌డిపిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. 40 ఏళ్ల వ‌య‌సులో కూడా కాజ‌ల్ అందాలు నెటిజ‌న్ల‌ను మంత్ర‌ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో కాజ‌ల్ బికినీలో కూడా క‌నిపించి కుర్రాళ్ల మ‌న‌సుల్ని కొల్లగొట్ట‌గా, నెటిజ‌న్లు ఆ ఫోటోల‌కు లైకులు, కామెంట్స్ చేసి వైర‌ల్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.


ఇక సినిమాల విష‌యానికొస్తే కాజ‌ల్ న‌టించిన క‌న్న‌ప్ప సినిమా జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క‌న్న‌ప్ప‌లో కాజ‌ల్ శివుని భార్య పార్వ‌తి దేవిగా క‌నిపించ‌నుంది. ఇది కాకుండా క‌మ‌ల్ హాస‌న్ ఇండియ‌న్3లో కాజ‌ల్ న‌టించింది. వీటితో పాటూ ది ఇండియా స్టోరీ అనే బాలీవుడ్ సినిమాలో కూడా కాజ‌ల్ న‌టిస్తోంది.