కాజల్ డేరింగ్ స్టెప్
ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ కాజల్ త్వరలోనే ఆ పాత్రను చేసి సైలెన్స్ ను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం.
By: Tupaki Desk | 19 Jun 2025 1:52 PM ISTలక్మీ కళ్యాణంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన కాజల్ ఆ తర్వాత చందమామ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. చందమామ తర్వాత కాజల్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక అమ్మడు కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళ, హిందీలోని స్టార్ హీరోలతో కలిసి నటించిన కాజల్ కొన్నేళ్ల పాటూ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని, ఓ బాబుకి జన్మనిచ్చి కొంత కాలం పాటూ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది కాజల్. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఎలాగైనా మళ్లీ బిజీ అవాలని చూస్తోన్న కాజల్ కు రీఎంట్రీ తర్వాత ఊహించిన బ్రేక్ అయితే దక్కలేదు. భగవంత్ కేసరి రూపంలో మంచి హిట్ దక్కినా ఆ సినిమా క్రెడిట్ అంతా బాలయ్య, అనిల్ ఖాతాలోనే పడింది.
దీంతో అమ్మడు ఈసారి కేవలం కథలను వింటూ అందులో నటిస్తే సరిపోదని, ఏకంగా మెగా ఫోన్ పట్టడానికి రెడీ అయింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కాజల్ డైరెక్టర్ గా మారడానికి రెడీ అవుతుందని సమాచారం. డైరెక్టర్ అవడమే కాకుండా ఆ సినిమాలో తానే ప్రధాన పాత్ర పోషించనుందని తెలుస్తోంది. సైలెంట్ గా మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు బాగా ఊపందుకుంది.
త్వరలోనే కాజల్ ఓ బోల్డ్ రోల్ ను చేసే అవకాశముందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ కాజల్ త్వరలోనే ఆ పాత్రను చేసి సైలెన్స్ ను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి ఎంతో నేర్చుకున్న తాను డైరెక్టర్ గా మారి అందరినీ మెప్పించాలని కాజల్ తన సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే చందమామ మెగాఫోన్ ను పట్టబోతుందని అంటున్నారు. ఏదేమైనా కాజల్ ఇప్పుడు డైరెక్టర్ గా మారడమనేది డేరింగ్ స్టెప్పే.
అయితే డైరెక్టర్ గా మారే క్రమంలో కాజల్ మిగిలిన సినిమాలను పక్కన పెడుతుందా అంటే లేదు. నటిగా కూడా కాజల్ పలు సినిమాలతో బిజీగా ఉంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమాలో కాజల్ పార్వతి దేవీగా కనిపించనుండగా ఆ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఇది కాకుండా కమల్ హాసన్ తో ఇండియన్3 తో పాటూ రామాయణం లో కూడా కాజల్ కీలక పాత్రలో కనిపించబోతుంది.
