కాజల్ కెరీర్ ముగిసినట్లేనా?
టాలీవుడ్ లో ఇప్పుడు సౌత్ భామలదే హవా. ముంబై, ఢిల్లీ మోడల్స్ కంటే నేచురల్ పెర్పార్మర్లకే టాలీవుడ్ ప్రాధాన్యత ఇస్తుంది.
By: Tupaki Desk | 29 May 2025 4:00 AM ISTహీరోయిన్ గా కాజల్ అగర్వాల్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి'లో బాలయ్యకు జోడీగా నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత కాజల్ హీరోయిన్ గా కనిపించింది లేదు. రజనీకాంత్ నటించిన 'ఇండియన్ 2'లో నటించింది. కానీ అనూహ్యంగా ఆ పాత్రను 'ఇండియన్ 3' కి మళ్లించారు.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు? ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు కూడా లేవు. బాలీవుడ్ లో 'సికిందర్' కాజల్ పాత్ర పేరుకే పరిమితమైంది. పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'లో గెస్ట్ రోల్ పోషిస్తుంది. 'ది ఇండియా స్టోరీ' అనే హిందీ చిత్రం చేస్తోంది. దీంతో పాటు 'రామయణ్' లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. హీరోయిన్ గా పరిచయమై కాజల్ ఇప్పుడు అతిధి పాత్రలకు..సెకెండ్ లీడ్ కు పరిమి తమవుతుంది.
దీంతో కాజల్ కెరీర్ ముగిసినట్లేనా? అన్న ప్రచారం నెట్టింట మొదలైంది. అమ్మడికి ఇక హీరోయిన్ అవకాశాలు దాదాపు దూరమైనట్లే అంటున్నారు. తెలుగులో సీనియర్ హీరోలతో కూడా ఇప్పటికే పనిచేసింది. మళ్లీ వాళ్ల సరసన ఎంపిక చేయడం కూడా కష్టమే. లేదంటే? త్రిషలా బండి లాంగిచేది. కానీ ఇప్పుడున్న పోటీలో త్రిష లా ఛాన్సులందుకోవడం మాత్రం కాజల్ కి కష్టమనే మాట వినిపిస్తుంది.
టాలీవుడ్ లో ఇప్పుడు సౌత్ భామలదే హవా. ముంబై, ఢిల్లీ మోడల్స్ కంటే నేచురల్ పెర్పార్మర్లకే టాలీవుడ్ ప్రాధాన్యత ఇస్తుంది. ఐదేళ్లగా చెన్నై, కర్నాటక, కేరళ నుంచి ఎక్కువగా హీరోయిన్లు దిగుమతి అవుతు న్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మందిని తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కాజల్ కి అవకాశాలు మరింత జఠిలంగా మారతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
