Begin typing your search above and press return to search.

చందమామకు 'మండోదరి' మిస్‌ అయిందా..?

సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో మండోదరి పాత్రకు గాను కాజల్‌ను తొలగించి మృణాల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 July 2025 7:08 PM IST
చందమామకు మండోదరి మిస్‌ అయిందా..?
X

ఇండియన్‌ సినీ ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'రామాయణ' ఒకటి. బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్ మేకర్‌ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ఎపిక్‌లో రాముడి పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌ పోషిస్తున్న విషయం తెల్సిందే. సీత పాత్రకు గాను సాయి పల్లవిని నటింపజేస్తున్నారు. ఇక సినిమాలో అత్యంత కీలకమైన రావణుడి పాత్రను కన్నడ స్టార్‌ యశ్‌తో చేయిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్‌ గ్లిమ్స్‌కు మంచి స్పందన దక్కింది. అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, చందమామ ఫేం కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

బాలీవుడ్‌ వర్గాల నుంచి గతంలో వచ్చిన వార్తల అనుసారం ఈ సినిమాలో యశ్‌ కి జోడీగా అంటే రావణుడి భార్య పాత్ర అయిన మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ సమయంలో కొందరు సీతగా సాయి పల్లవి ఉండి, మండోదరి పాత్రకు కాజల్ అగర్వల్‌ ఏంటి అంటూ చాలా మంది విమర్శలు చేశారు. సీత పాత్రకు సాయి పల్లవిని అయినా తొలగించాలి లేదంటే మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ను నటింపజేయవద్దు అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. కాజల్ అగర్వాల్‌ అందం ముందు సాయి పల్లవి అందం తేలిపోతుంది. కనుక వీరిద్దరు ఒకే సినిమాలో ఆయా పాత్రలకు సెట్‌ కారు అనేది చాలా మంది అభిప్రాయం.

సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో మండోదరి పాత్రకు గాను కాజల్‌ను తొలగించి మృణాల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మండోదరి పాత్ర విషయంలో మేకర్స్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రాముడు, సీత, రావణుడి పాత్ర విషయంలో మాత్రమే మేకర్స్ నుంచి స్పష్టత వచ్చింది. ఇతర పాత్రల గురించి అన్ని కూడా పుకార్లే కావడం విశేషం. కాజల్‌ అగర్వాల్‌ ను గతంలో ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మృణాల్‌ ఠాకూర్ అంటున్నారు. కాజల్‌ అగర్వాల్‌ గతంలో మేకప్‌ టెస్ట్‌కు హాజరు అయిందని ఇన్‌సైడ్‌ టాక్‌ వచ్చింది. కనుక మృణాల్‌ ను మండోదరి పాత్రకు ఎంపిక చేశారు అంటూ వస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చు.

కాజల్‌ అగర్వాల్‌ కి ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు గాను మేకర్స్‌ ఈ సినిమాలో మండోదరి పాత్రకు తీసుకుని ఉంటారు. మండోదరి సినిమాలో కొన్ని నిమిషాలే కనిపించినా కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే మేకర్స్‌ కాజల్‌ అగర్వాల్‌ను తొలగించే అవకాశం లేదని కొందరు అంటున్నారు. చందమామ కు మండోదరి పాత్ర చేజారింది అంటూ వస్తున్న వార్తలు నిజం కావద్దని చాలా మంది కోరుకుంటున్నారు. మండోదరి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ కనిపించాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. రామాయణ సినిమాలో యశ్‌కి జోడీగా కాజల్‌ నటిస్తే ఖచ్చితంగా అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.