డైరెక్టర్ గా మారనున్న హీరోయిన్?
మొదట్లో గ్లామరస్ పాత్రల్లో నటించినా, ఆ తర్వాత మగధీర, చందమామ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించిన కాజల్, ఆ తర్వాత తమిళంలో అందాల ఆరబోతకే ఎక్కువగా పరిమితమైంది
By: Tupaki Desk | 12 Jun 2025 12:07 PM ISTటాలీవుడ్ ఆడియన్స్ ను కట్టిపడేసిన హీరోయిన్లలో చందమామ కాజల్ కూడా ఒకరు. స్క్రీన్ పై ట్రెండీ గా కనిపించడంతో పాటూ హీరోల పక్కన మాస్ స్టెప్పులేస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన కాజల్ కేవలం సినిమాలే కాకుండా వెబ్‌సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియన్ హీరోయిన్ గాపేరు తెచ్చుకున్న కాజల్, తెలుగు సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది.
మొదట్లో గ్లామరస్ పాత్రల్లో నటించినా, ఆ తర్వాత మగధీర, చందమామ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించిన కాజల్, ఆ తర్వాత తమిళంలో అందాల ఆరబోతకే ఎక్కువగా పరిమితమైంది. మధ్యలో ఒకటి రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. 2020లో గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని మధ్యలో కొన్నాళ్ల పాటూ కాజల్ ఇండస్ట్రీకి దూరమైంది.
బాబు పుట్టాక మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన కాజల్, ప్రస్తుతం కమల్ హాసన్ చేస్తున్న ఇండియన్3లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో పాటూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న మైథలాజికల్ మూవీ కన్నప్పలో పార్వతీదేవిగా నటించింది. ఇవి కాకుండా కాజల్ చేతిలో కొత్త అవకాశాలేమీ లేవు. ఓ వైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ, మరోవైపు సొంత బిజినెస్ లతో కూడా కాజల్ బిజీగా ఉంది.
అయితే సినిమాల పరంగా తనకు ఛాన్సులు తక్కువైన నేపథ్యంలో మళ్లీ అవకాశాలను దక్కించుకోవాలనే ఆలోచనతో కాజల్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాజల్ మెగాఫోన్ ను పట్టి డైరెక్టర్ గా సినిమా చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రైమ్ టైమ్ లోకి రావాలనే ఆలోచనతో స్వీయ దర్శకత్వంలో హీరోయిన్ గా సినిమా చేయాలని చూస్తోందట.
బాలీవుడ్ లో కమర్షియల్ అంశాలతో ఓ సినిమాను తెరకెక్కించడానికి కాజల్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఆల్రెడీ కెరీర్లో స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన కాజల్ ఇప్పుడు వచ్చిన ఆఫర్లను చేసుకుంటూ, వ్యాపారాలను చేసుకోకుండా అనవసరంగా డైరెక్టర్ గా మారి రిస్క్ చేయడం ఎందుకని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి కాజల్ మనసులో ఏముందో చూడాలి.
