మొత్తానికి కాజల్ రివీల్ చేసిందిగా
రామాయణం సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, కాజల్ ఆ గ్లింప్స్ ను షేర్ చేస్తూ తాను కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
By: Tupaki Desk | 3 July 2025 6:40 PM ISTటాలీవుడ్ లోని సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. కాజల్ ఫుల్ లెంగ్త్ రోల్ లో ఆఖరిగా కనిపించిన సినిమా సత్యభామ. భారీ అంచనాలతో వచ్చిన సత్యభామ ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయింది. కాగా కాజల్ తాజాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప సినిమాలో పార్వతి దేవీగా కనిపించారు. కన్నప్పలో కాజల్ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి.
ఇప్పుడు కాజల్ ఎంతో ప్రతిష్టాత్మకమైన రామాయణం అనే సినిమాలో నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. గతంలోనే కాజల్ రామాయణం సినిమాలో మండోదరి అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు వార్తలొచ్చాయి కానీ దానిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. రామాయణం సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, కాజల్ ఆ గ్లింప్స్ ను షేర్ చేస్తూ తాను కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
జెనరేషన్స్ ను తీర్చిదిద్దిన కథలో భాగమవడం ఎంతో గౌరవంగా ఉందని, రాముడు వర్సెస్ రావణుడి కథ అయిన నమిత్ మల్హోత్రా రామాయణ ప్రపంచానికి స్వాగతం చెప్తూ, ఈ మార్గంలో నడిచినందుకు మరియు దాన్ని అందరితో షేర్ చేసుకున్నందుకు కాజల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూమెంట్ ను కలిసి సెలబ్రేట్ చేసుకుందామని, రామాయణం మన నిజం, మన చరిత్ర అని కాజల్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కాగా రణబీర్ కపూర్ రామాయణంలో రాముడి పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి సీత గా నటిస్తున్నారు. కాజల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మండోదరి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రావణాసురుడుగా యష్ నటిస్తుండగా, ఆయనకు భార్య పాత్రలో కాజల్ నటించనున్నారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుండగా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది.
