Begin typing your search above and press return to search.

ఆ హిట్ సీక్వెల్‌ కి చాలా టైం పట్టేనా..?

ఈ ఏడాదిలో ఖైదీ సీక్వెల్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు.

By:  Tupaki Desk   |   15 March 2024 9:30 AM GMT
ఆ హిట్ సీక్వెల్‌ కి చాలా టైం పట్టేనా..?
X

తమిళ స్టార్‌ హీరో కార్తీ, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ 2019 లో వచ్చిన ఖైదీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అప్పటి నుంచి ప్రేక్షకులు ఖైదీ సీక్వెల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖైదీ తర్వాత లోకేష్ కనగరాజ్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. దాంతో ఖైదీ సీక్వెల్‌ కి మరింత క్రేజ్ పెరిగింది.

ఈ ఏడాదిలో ఖైదీ సీక్వెల్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి హడావుడి లేదు. తాజాగా లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజు జరిగింది. ఆ సమయంలో ఖైదీ సీక్వెల్‌ పై ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ నిరాశే మిగిలింది.

ఖైదీ నిర్మాణ సంస్థ నుంచి లోకేష్ కనగరాజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. కానీ అందులో ఖైదీ 2 విషయమై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దాంతో ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో అసలు ఖైదీ 2 ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తలైవర్ 171వ సినిమాని రూపొందించే పనిలో ఉన్నాడు. బాలీవుడ్‌ స్టార్స్ రణవీర్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్న తలైవర్‌ 171 తర్వాత ఖైదీ 2 సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు విక్రమ్‌ మరియు లియో సీక్వెల్‌ లు కూడా ఉంటాయని సమాచారం అందుతోంది.

విక్రమ్‌ తర్వాత లియో తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లోకేష్‌ కనగరాజ్ ఆ స్థాయిలో మెప్పించడం లో విఫలం అయ్యాడు. లోకేష్ కనగరాజ్‌ మార్క్ మిస్‌ అయ్యింది అంటూ లియో సినిమా కు రివ్యూలు వచ్చాయి. తలైవర్‌ 171 కంటే కూడా ఖైదీ 2 మరియు విక్రమ్‌ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.