'ఖైదీ 2' లో బిర్యానీ స్టార్ అతడా?
కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `ఖైదీ 2`కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలి సిందే.
By: Tupaki Desk | 23 July 2025 11:00 PM ISTకార్తీ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `ఖైదీ 2`కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో 'కూలీ' రిలీజ్ అనంతరం 'ఖైదీ 2' రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేలా లోకేష్ ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ఈ లోగా కార్తీ కూడా మిగతా సినిమాల నుంచి రిలీవ్ అయిపోతాడు. అప్పటి నుంచి ఇద్దరు 'ఖైదీ 2' తో నే బిజీగా ఉంటారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో విలక్షణ నటుడు అశిష్ విద్యార్దిని ఓ కీలక పాత్రకు తీసుకున్నట్లు వినిపిస్తుంది.
ఇందులో బిర్యానీ వంటే వంటవాడి పాత్రలో అశిష్ విద్యార్ది కనిపించనున్నాడుట. బిర్యానీ అంటే ఖైదీ మొత్తానికే హైలైట్ సీన్ అని చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీ కార్తీ పరిచయ సన్నివేశంలోనే బకెట్ బిర్యానీ తింటాడు. జైలు నుంచి రిలీజ్ అయిన ఢిల్లీ డీల్ ప్రకారం ప్రమాదంలో ఉన్న వారిని పోలీసుల సహా యంతో కాపాడాలి. అప్పుడే బకెట్ బిర్యానీ లాంగించే సీన్ వస్తుంది. అందులో కార్తీ నటన ఎంతో మెప్పి స్తుంది. మా స్ రోల్ లో కార్తీ ఒదిగిపోయాడు.
అయితే ఇప్పుడీ పాత్ర కు..అశిష్ విద్యార్ది బిర్యానీ మాష్టర్ రోల్ పోషించడానికి ఓ బలమైన కారణం ఉందం టున్నారు. ఢిల్లీ అండ్ గ్యాంగ్ ఛేజ్ చేసి పట్టుకునే గ్యాంగ్ కి...బిర్యానీ మాష్టర్- రోలెక్స్ కి సంబంధా లుం టాయట. ఆరోల్ ఎంతో మాసివ్ గా ఉంటుందిట. ఇప్పుడా పాత్ర కోసం అశిష్ ని రంగంలోకి దించడం ఇంట్రెస్టింగ్. అశిష్ విద్యార్ధి ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయలేదు. గత ఏడాది 'కిల్' అనే ఒకే ఒక్క సినిమా చేసారు. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాలేవి చేయలేదు.
ఈ గ్యాప్ ని ఆయన ఎంతో ఆస్వాదిస్తున్నాడు. ఆయన కూడా మంచి పుడీ. పుడ్ వీడియోలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అశిష్ కూడా మంచి నాన్ వెజ్ ప్రియుడు. ఇప్పుడు ఆయనకు తగ్గ పాత్రే ఖైదీ 2 లో వస్తున్నట్లు కనిపిస్తోంది. అశీష్ తెలుగు ఆడియన్స్ కు బాగా తెలిసిన నటుడు. తెలుగులో ఎన్నో సినిమా లు చేసారు. నటుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా నెగిటివ్ పాత్రలకు పెట్టింది పేరుగా కొనసాగారు. అలాంటి నటుడు లోకేష్ ప్రాజెక్ట్ లో పడితే మరింత వన్నె తప్పనిసరి.
