Begin typing your search above and press return to search.

86 ఏళ్ల వృద్దుడే హీరో..జాతీయ ఉత్త‌మ చిత్రమ‌ది!

ఈ సినిమాలో క‌థానాయ‌కుడు 86 ఏళ్లే ఓ వృద్దుడు. ఆ పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుంది.

By:  Tupaki Desk   |   25 Aug 2023 1:27 PM GMT
86 ఏళ్ల వృద్దుడే హీరో..జాతీయ ఉత్త‌మ చిత్రమ‌ది!
X

69వ జాతీయ ఉత్త‌మ న‌టుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే.. ఉత్త‌మ చిత్రంగా తమిళ సినిమా 'కడైసీ వివసాయి' (ది లాస్ట్ ఫార్మర్) ఎంపికైన సంగ‌తి తెలిసిందే. మ‌ణికంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అయింది. ఇందులో హీరో పాతికేళ్ల కుర్రాడు గ‌ట్రా అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఈ సినిమాలో క‌థానాయ‌కుడు 86 ఏళ్లే ఓ వృద్దుడు. ఆ పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుంది.

అందుకే జాతీయ ఉత్త‌మ చిత్రంగా అవార్డు కైవ‌సం చేసుకుంది. ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఆ వృద్దుడు పుట్టి పెరిగిన ఊరు.. తన పూర్వీకుల నుంచి వచ్చిన కొద్ది పాటి పొలం .. చిన్నపాటి గుడిసె .. ఇదీ అతని ఆస్తి. చాలా సాధార‌ణ‌మైన జీవితం. ఇల్లు ..పొలం..పంట ఇదే అత‌ని జీవితం. ఊళ్లో వాళ్లంతా ఆయన అనుభవాన్ని గౌరవిస్తూ ఉంటారు. ఆక‌లితోనైనా ఉంటాడు గానీ అప్పు మాత్ర చేయ‌డు.

అలాంటి పెద్దాయ‌న పోలంపై ఊరి కొంత మంది ఊరి పెద్ద‌ల క‌న్ను ప‌డుతుంది. ఎలాగైనా ఆ పొలం ద‌క్కించుకో వాల‌ని చూస్తారు. ఈ క్ర‌మంలో చనిపోయిన నెమ‌ళ్ల‌ను ఆ వృద్దుడి పొలం లో పూడ్చిన పెద్ద‌లు అత‌డిపైనే తిరిగి కేసు పెడ‌తారు. పోలీస్ వ్యవస్థ .. కోర్టు .. వాదనలు ఇవేమీ ఆయనకి తెలియ‌వు. అర్దం కావు. త‌న పొలం..నీళ్లు...ప‌శువులు ఇదే అత‌ని ఆలోచ‌నే. ఆయ‌న‌లో ఆ త‌ప‌నే త‌న నిజాయితీని నిరూపిస్తుంది.

ఆ వృద్దుడిలో ఈ అంశాలే జ‌డ్జిని క‌దిలిస్తాయి. ఇలాంటి భోవోద్వేగాలు సినిమా ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కూ క‌నిపిస్తాయి. సినిమా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. తాను అలవాటు పడిన ప్రకృతికి దూరంగా బ్రతకలేడని చాటిచెప్పే మ‌న‌సును క‌ద‌లిస్తుంది.. కన్నీళ్లు పెట్టిస్తుంది. జాతీయ అవార్డు జ్యూరీని కూడా అవే అంశాలు క‌దిలించాయి. అందుకే ఉత్త‌మ చిత్రంగా ఎంపికైంది. ఈ అవార్డుకి నూరుశాతం న్యాయం చేసిన సినిమా అది.