ఇండస్ట్రీలోని వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది
అయితే ఈ విషయంపై తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 13 Jun 2025 4:01 PM ISTవర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ కారణంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఓ భారీ సినిమా నుంచి వైదొలగాల్సి వచ్చిందనే వార్తలు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 8 గంటల కంటే ఎక్కువ వర్క్ చేయనని చెప్పడంతో పాటూ రూ.25 కోట్ల పారితోషికం అడగడం వల్లే దీపికాను ఆ ప్రాజెక్టు నుంచి తప్పించారన్నారు.
అయితే ఈ విషయంపై తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చందూ ఛాంపియన్, భజరంగీ భాయీజాన్ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలను అందించిన కబీర్ ఖాన్ వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికా డిమాండ్స్ ను సమర్ధించడంతో పాటూ ఆమె అడిగిన విషయంలో తప్పేముందని తిరిగి ప్రశ్నించారు.
సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని, వారి హెల్త్ కూడా అందరి లాంటిదేనని, వారికి కూడా పర్సనల్ టైమ్ కావాలని, స్టార్ హీరోలైన ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా రోజుకు 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తారని, వారి విషయంలో తప్పు కానిది దీపికా విషయంలో అది ఎందుకు తప్పుగా మారిందో తనకు అర్థం కావడం లేదని కబీర్ ఖాన్ అన్నారు.
ఒక సినిమాలో ఎవరినైనా రిజెక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్లకు స్ట్రాంగ్ రీజన్ ఉండాలని, మూవీ షూటింగ్స్ కోసం యాక్టర్లు వారి పర్సనల్ లైఫ్ ను త్యాగం చేయాలనే వాదనతో తానెప్పుడూ ఏకీభవించనని, పర్సనల్ గా తానెప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్ చేసింది లేదని, ఇప్పటివరకు తన కెరీర్లో ఆదివారాల్లో షూటింగ్ చేసింది లేదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా దీపికా రెమ్యూనరేషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆదరణ ఉన్న ఎవరికైనా తమ రేంజ్ రెమ్యూనరేషన్ అడిగే హక్కు ఉందని, వ్యక్తులను చూసి కాకుండా వారికున్న స్టార్‌డమ్ ను చూసి రెమ్యూనరేషన్ ను ఇవ్వాలని ఆయన కోరారు. ప్రస్తుతం దీపికా కు సంబంధించి కబీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.