Begin typing your search above and press return to search.

వెయ్యి కోట్ల స్కామ్.. హీరోయిన్ కు 35 లక్షలు?

తాజాగా చెన్నైలో జరిగిన ఈడీ దాడుల్లో పలువురు కీలక వ్యక్తులను విచారించగా, వారిలో కొందరు సినీ రంగానికి సంబంధాలున్నట్లుగా పేర్కొన్నారని సమాచారం

By:  Tupaki Desk   |   22 May 2025 12:51 PM IST
వెయ్యి కోట్ల స్కామ్.. హీరోయిన్ కు 35 లక్షలు?
X

తమిళనాడు రాష్ట్రంలో టాస్మాక్ (TASMAC) వ్యవస్థలో చోటుచేసుకున్న భారీ లిక్కర్ కుంభకోణం ఇప్పుడు తమిళ పరిశ్రమను కదిలిస్తోంది. దాదాపు 1000 కోట్ల ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నిర్వహించిన దాడుల్లో కొన్ని సంచలన విషయాలు బయటపడినట్టు సమాచారం. ఇందులో కొంతమంది ప్రముఖుల పేర్లు చర్చకు రావడం, తద్వారా నటి కయాదు లోహర్ పేరు కూడా మీడియాలో ప్రస్తావించబడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

తాజాగా చెన్నైలో జరిగిన ఈడీ దాడుల్లో పలువురు కీలక వ్యక్తులను విచారించగా, వారిలో కొందరు సినీ రంగానికి సంబంధాలున్నట్లుగా పేర్కొన్నారని సమాచారం. ముఖ్యంగా కయాదు లోహర్ అనే యువ నటి టాస్మాక్ లిక్కర్ డీలింగ్‌కు సంబంధించి హై ప్రొఫైల్ పార్టీల్లో పాల్గొన్నారని, అందుకు రూ.35 లక్షలు చెల్లించారని ఆరోపణలు వెలువడుతున్నాయి.

అయితే ఇది అధికారికంగా నిర్ధారణ కాకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ‘డ్రాగన్’ సినిమాతో తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కయాదు, తమిళంలోనూ అధర్వ, జీవీ ప్రకాష్, శింబు లాంటి హీరోలతో అవకాశాలు పొందుతోంది. ఇటువంటి సమయంలో ఈ విధంగా ఆరోపణల వలలో పడటం ఆమె కెరీర్‌పై మిగిలే ప్రభావంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

అయితే ఈ అంశంపై ఇప్పటివరకు కయాదు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఇక టాస్మాక్ స్కామ్ గురించి చెప్పాలంటే, తమిళనాడు ప్రభుత్వానికి చెందిన లిక్కర్ డిస్టిబ్యూషన్ వ్యవస్థలో వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో పాలిటికల్ ఫిగర్స్, అధికారుల ప్రమేయంతో పాటు ఇతర ప్రముఖ రంగాలవారితో అనుబంధాలు ఉన్నట్లుగా మొదటి అంచనా ఉంది.

ఇదే తరుణంలో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ పార్టీలకు సంబంధం ఉన్నట్టు ప్రచారం కావడం తెలుగు-తమిళ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం కయాదు లోహర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇదయం మురళి’. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అధర్వ, ఎస్. థమన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మినహా కయాదు ప్రస్తుతం ఇతర పలు తమిళ, తెలుగు ప్రాజెక్ట్స్‌లోనూ చర్చల్లో ఉంది. అయినా సరే, ఈ రూమర్లు నిజంగా ప్రభావం చూపిస్తాయా లేదా అనేది ఆమె తదుపరి నిర్ణయాలను బట్టి తేలనుంది.