Begin typing your search above and press return to search.

మీరే నా హీరో..స‌మంత ఇంట్రెస్టింగ్ పోస్ట్!

మ‌ల‌యాళం స్టార్ మ‌మ్ముట్టి-జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన 'కాథల్ ది కోర్' ఇటీవ‌ల రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Nov 2023 1:57 PM GMT
మీరే నా హీరో..స‌మంత ఇంట్రెస్టింగ్ పోస్ట్!
X

మ‌ల‌యాళం స్టార్ మ‌మ్ముట్టి-జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన 'కాథల్ ది కోర్' ఇటీవ‌ల రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. జియో బేబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాకి మంచి రివ్యూలు వ‌చ్చాయి. విమ‌ర్శ‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఫ్యామిలీ డ్రామా ఆద్యంతం కేర‌ళ అభిమానుల్ని అల‌రించింది. దీంతో ఈ చిత్రాన్ని ఇత‌ర భాషల్లో కూడా రిలీజ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి సినిమాలు భార‌తీయ ప్ర‌జ‌లంతా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందంటూ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే కంటెంట్ ప‌రంగా కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కుంటుంది. స్వ‌లింగ సంపర్కాన్ని ప్రోత్స‌హించేలా ఉంద‌ని కువైట్..ఖ‌త‌ర్ దేశాలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసాయి. అయితే రిలీజ్ త‌ర్వాత సానుకూలత వ్య‌క్తం అవుతుంది. ఈ నేప‌థ్యంలో సినిమాని బార‌త్ వెలుప‌లా రిలీజ్ చేయాల‌ని కోరుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమాని ఉద్దేశించి స‌మంత ఆస‌క్తిర పోస్ట్ పెట్టారు. 'సినిమా ఆఫ్ ది ఇయర్. మమ్ముటీ సార్.. మీరే నా హీరో. జ్యోతిక లవ్ యూ. ఇద్ద‌రు ఎంతో గొప్పగా న‌టించారు. న‌ట‌న‌ స‌హ‌జ‌త్వం న‌న్ను ఎంత‌గానే ఆక‌ట్టుకుంది. జియో బేబీ ఓ లెజెండరీ మేక‌ర్. నా సంతోషాన్ని మీతో పంచుకోకుండా ఉండ‌లేక‌పోయాను. అందుకే ఇలా మీ ముందుకు వ‌చ్చాను. మీ నుంచి ఇలాంటి గొప్ప చిత్రాలు మ‌రిన్ని రావాలి' అని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఇక స‌మంత కొన్ని నెల‌లుగా అమెరికాలో ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఏడాది పాటు ఎలాంటి సినిమాల్లో న‌టించ‌న‌ని..పెండింగ్ ప్రాజెక్ట్ లు అన్ని పూర్తిచేసి అమెరికా వెళ్లిపోయింది. అక్క‌డ నుంచి త‌న కార్య‌క‌లా పాలు అన్నింటిని న‌డిపిస్తుంది. తిరిగొచ్చిన త‌ర్వాత అమ్మ‌డు బాలీవుడ్ పై ఫోక‌స్ చేస్తుందా? టాలీవుడ్ సినిమాలు చేస్తుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే బాలీవుడ్ మేక‌ర్స్ తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది.