రెట్రో లుక్ లో అంచనాలు పెంచేస్తున్న హీరోయిన్
దుల్కర్ సల్మాన్ హీరోగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 12:13 PMదుల్కర్ సల్మాన్ హీరోగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు కాంత. ఈ సినిమా నుంచి దుల్కర్ ఫస్ట్ లుక్ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 1950 నాటి స్టైల్ లో దుల్కర్ చాలా కొత్తగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాంత ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై అందరికీ అంచనాలు పెరిగాయి.
ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంత సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమాపై ఇంట్రెస్ట్ ను, హైప్ ను పెంచడానికి చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు కాంత మూవీకి సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఆ సినిమా నుంచి కీలక నటుల లుక్స్ ను రిలీజ్ చేస్తోంది.
అందులో భాగంగానే తాజాగా కాంత సినిమాలోని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే లుక్ ను రిలీజ్ చేసింది. ఇవాళ భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు కానుకగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ మేకర్స్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో భాగ్యశ్రీ తనకు సరిగ్గా సూటయ్యే లుక్ లో ఎంతో అందంగా కనిపించింది. చీర కట్టు, గాజులు, బొట్టుతో అచ్చతెలుగమ్మాయిలా భాగ్యశ్రీ ఈ పోస్టర్ లో దర్శనమిచ్చింది. 1950 కాలం నాటి పాత్రలో భాగ్యశ్రీ భలే ఒదిగిపోయింది. కాంతలోని భాగ్యశ్రీ లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.