Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ సినిమాలో జగతి మేడం...?

కన్నడ మీడియా లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్న సినిమా లో జ్యోతి రాయ్ కి ఛాన్స్ దక్కిందనే కథనాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   20 Jan 2024 5:36 AM GMT
ఎన్టీఆర్‌ సినిమాలో జగతి మేడం...?
X

గుప్పెడంత మనసు సీరియల్‌ తో మంచి గుర్తింపు దక్కించుకున్న నటి జ్యోతి రాయ్‌. బుల్లి తెరపై సెన్షేషన్ క్రియేట్‌ చేసిన జ్యోతి రాయ్‌ ఇప్పటికే ఒక వెబ్‌ సిరీస్ తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ మధ్య సోషల్‌ మీడియాలో జ్యోతి రాయ్‌ వెబ్‌ సిరీస్ గురించి చర్చ జరిగింది.

ఓటీటీ నుంచి ఇప్పుడు వెండి తెరపై తన ముద్ర వేసేందుకు గాను జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్ రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. కన్నడ మీడియా లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్న సినిమా లో జ్యోతి రాయ్ కి ఛాన్స్ దక్కిందనే కథనాలు వచ్చాయి.

ఒక కన్నడ మీడియా సంస్థ ప్రచురించిన ఆ కథనం ను జ్యోతి రాయ్ తన సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం ద్వారా నిజంగానే ఎన్టీఆర్‌ సినిమాలో ఆమె నటించబోతుందని చాలా మంది అనుకుంటున్నారు. మొత్తానికి ప్రశాంత్‌ నీల్‌ వంటి భారీ చిత్రాల దర్శకుడి దర్శకత్వంలో జ్యోతి రాయ్ కి నటించే అవకాశం దక్కినట్టు గానే ఉంది.

సీరియల్‌ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న జ్యోతి రాయ్ సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటూ ఉంది.

ఆ పాపులారిటీ కారణంగా ఎన్టీఆర్ సినిమా లో నటించే అవకాశాన్ని దక్కించుకుని ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ దేవర మరియు వార్‌ సినిమాలు చేయాల్సి ఉంది. మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ సలార్ 2 ను చేయాల్సి ఉంది. ఆయా సినిమాలు పూర్తి అయితే ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్‌ జత కడుతారు.

వీరి కాంబోలో మూవీ 2025 లో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అప్పటి వరకు ఈ అమ్మడు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వార్తల విషయంలో క్లారిటీ రావాలంటే అప్పటి వరకు వెయిట్‌ చేయాల్సిందే.