కోర్టులో జ్యోతిక-సోనాక్షి మధ్య కొట్లాట!
సూర్య సతీమణి జ్యోతిక నటిగా బిజీ అయిన సంగతి తెలిసిందే. చెన్నై టూ ముంబై షిప్ట్ అయిన దగ్గర నుంచి హిందీ ప్రాజెక్ట్ లో బిజీగా గడుపుతున్నారు.
By: Tupaki Desk | 9 Jun 2025 12:15 PM ISTసూర్య సతీమణి జ్యోతిక నటిగా బిజీ అయిన సంగతి తెలిసిందే. చెన్నై టూ ముంబై షిప్ట్ అయిన దగ్గర నుంచి హిందీ ప్రాజెక్ట్ లో బిజీగా గడుపుతున్నారు. 'కాదిల్ ది కోర్', 'డబ్బా కార్టెల్' లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. మంచి అవకాశాలొస్తే ఇతర భాషల్లోనూ కమిట్ అవుతున్నారు. తాజాగా జ్యోతిక బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాతో తలపడుటుంది. ఇద్దరు ప్రధాన పాత్రల్లో ఓ కోర్ట్ రూమ్ వార్ డ్రామా తెరకెక్కుతుంది.
'బరేలీ కి బర్పీ ఫేమ్' అశ్విన్ అయ్యర్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్ పై పర్హాన్ అక్తర్- రితేద్ సిధ్వానీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇందులో జ్యోతిక-సోనాక్షి సిన్హా కోర్టులో ముఖాముఖి తలపడే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా మలు స్తున్నారుట. వాదప్రతి వాదనల మధ్య కోర్టు రూమ్ వార్ రూమ్ గా మారిపోతుందిట.
ఇద్దరు కోర్టులో నువ్వా? నేనా? అన్న రేంజ్ లో జడ్జ్ మెంట్ కోసం తలపడే సన్నివేశాలు రక్తి కట్టిస్తాయని తెలుస్తోంది. మరి న్యాయం కోసం పోరాడే న్యాయవాది సోనాక్షి అవుతుందా? జ్యోతిక అవుతుందా? అన్నది సస్పెన్స్. ప్రస్తుతం సోనాక్షి సిన్హా బాలీవుడ్ కెరీర్ కూడా ఏమంత గొప్పగా లేవు. వరుస పరాజయాలు ఎదుర వుతున్నాయి. దీనికి తోడు స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావడం లేదు.
సౌత్ నుంచి వెళ్లిన రష్మికా మందన్నా అక్కడ కొంత మంది భామలకు పోటీగా మారింది. వాళ్లకు రావాల్సిన అవకాశాలను రష్మిక లాగేసుకుంటుంది. చిన్న చితాక ఛాన్సు లేవైనా ఉన్నాయంటే కీర్తి సురేష్ , శ్రీలీల, సమంత లాంటి వారు పోటీగా మారుతున్నారు. సోనాక్షి పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశాలు కూడా తగ్గాయి.
