Begin typing your search above and press return to search.

జ్యోతి పూర్వాజ్.. సింపుల్ గానే హీటెక్కించేసింది

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో జ్యోతి పూర్వాజ్ ఒకరు. నటిగా మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోషూట్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది

By:  Tupaki Desk   |   10 April 2025 8:23 AM IST
జ్యోతి పూర్వాజ్.. సింపుల్ గానే హీటెక్కించేసింది
X

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో జ్యోతి పూర్వాజ్ ఒకరు. నటిగా మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోషూట్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రెస్టారెంట్‌లో కాఫీ లేదా వాటర్ గ్లాస్‌తో ముస్తాబైన ఈ ఫోటోషూట్ చాలా స్టైలిష్ గా, ఫ్రెష్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలలో జ్యోతి మరీ అందంగా మెరిసిపోయింది. రెడ్ V నెక్ టాప్, ఓపెన్ హెయిర్ స్టైల్, లైట్ మేకప్‌లో ఆమె లుక్ చాలా ఆకట్టుకుంటోంది.

కళ్లలో వున్న సాఫ్ట్ ఎక్స్‌ప్రెషన్స్, స్మైలింగ్ ఆమె సౌందర్యాన్ని మరింత మెరిపించాయి. ముఖ్యంగా ఆమె నాచురల్ బ్యూటీకి సోషల్ మీడియా యూజర్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల జ్యోతి పూర్వాజ్ కొన్ని టీవీ షోస్‌, యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా పాపులర్ అయింది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిందామె. అయితే మోడలింగ్, గ్లామర్ ఫొటోషూట్ల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఇప్పుడు ఆమె వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జ్యోతి పూర్వాజ్ కి ఫాలోయింగ్ భారీగానే ఉంది. ప్రతి ఫోటోపోస్ట్‌కు వేలల్లో లైక్స్‌, వందలలో కామెంట్స్ వస్తుండటంతో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. తన అందాన్ని బోల్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా ప్రెజెంట్ చేస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

ఈ లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే.. ఆమె కెరీర్ కొత్త దిశలో సాగుతుందని, మరిన్ని అవకాశాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. సింపుల్ కానీ స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తున్న జ్యోతి, నటనతో పాటు గ్లామర్ ఆటిట్యూడ్ తో కూడా అలరిస్తోంది. త్వరలోనే ఓటీటీలు లేదా మ్యూజిక్ వీడియోల ద్వారా మరింతగా ప్రేక్షకుల మన్ననలు పొందే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.