Begin typing your search above and press return to search.

సీరియల్స్‌ లో అలా సిరీస్ ల్లో ఇలా... ముద్దులతో హద్దులు దాటి

కన్నడంలో మంచి గుర్తింపును దక్కించుకుని తెలుగు లో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ జ్యోతి రాయ్‌

By:  Tupaki Desk   |   17 Nov 2023 8:47 AM GMT
సీరియల్స్‌ లో అలా సిరీస్ ల్లో ఇలా... ముద్దులతో హద్దులు దాటి
X

కన్నడంలో మంచి గుర్తింపును దక్కించుకుని తెలుగు లో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ జ్యోతి రాయ్‌. ఈ అమ్మడు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు అమ్మగా, అత్తగా మాత్రమే తెలుసు. అయితే ఈమె లో మరో యాంగిల్ ఉందని ఈ మధ్య సోషల్‌ మీడియా ద్వారా తెలిసింది.


వయసు నాలుగు పదులకు దగ్గర పడుతున్నా కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగానే జ్యోతి రాయ్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. సీరియల్‌ లో కనిపించేది ఆమెనేనా అనే అనుమానాలు కూడా కలిగే విధంగా సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ షాక్ ఇస్తోంది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా షాక్‌ ఇచ్చింది.

ఇన్నాళ్లు సీరియల్స్ ద్వారా నటనతో మెప్పించిన జ్యోతి రాయ్‌ ఇప్పుడు తన హాట్‌ అందాలతో ఓటీటీ ద్వారా కుమ్మేయబోతుంది. ఇప్పటికే ఈమె ప్రెటీ గర్ల్‌ అనే వెబ్‌ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ లో ఏకంగా ముద్దు సన్నివేశాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేయడంతో పాటు, ముద్దు సన్నివేశాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు.

సీరియల్స్‌ లో చీర కట్టులో ఒక ఆంటీ మాదిరిగా కనిపించిన జ్యోతి రాయ్‌ ఇప్పుడు ఇంత హాట్‌ గా కనిపించడం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ముద్దు సన్నివేశాలతో హద్దులు దాటినట్లుగా అనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయితే జ్యోతి రాయ్‌ క్రేజ్‌ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.