Begin typing your search above and press return to search.

సెకండ్ మ్యారేజ్.. ఎట్టకేలకు రివీల్ చేసిన జగతి మేడం

తాజాగా సుకు పూర్వాజ్ బర్త్ డే సందర్భంగా జ్యోతి రాయ్ ఓ పోస్ట్ పెట్టింది. "మనం కలిసి ఏడాది అయింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 9:39 AM GMT
సెకండ్ మ్యారేజ్.. ఎట్టకేలకు రివీల్ చేసిన జగతి మేడం
X

జ్యోతి రాయ్ అనే కంటే జగతి మేడం అంటే జనాలు టక్కున గుర్తుపట్టేస్తారు. గుప్పెడంత మనసు తెలుగు సీరియల్‌ తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కన్నడ నటి జ్యోతి రాయ్ స్క్రీన్ కంటే సోషల్ మీడియాలోనే సెన్సేషన్ అని చెప్పాలి. సీరియల్స్‌ లో చాలా పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూ ఫొటోలు షేర్ చేస్తుంది. రీసెంట్‌ గా ఈ నటి తన ఎదపై టాటూ వేయించుకుంది.

ఇక జ్యోతికి 20 సంవత్సరాల వయసులో పద్మనాభ అనే వ్యక్తితో వివాహమై విడిపోయారట. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారట. కానీ కొన్ని నెలలుగా కన్నడ యంగ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె కూడా తన పేరు పక్కన ఆయన పేరును యాడ్ చేసుకున్నారు. దీంతో వీరిద్దరు సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు జ్యోతి రాయ్.. ఇన్ స్టా పోస్ట్ వాటిని కన్ఫార్మ్ చేస్తోంది.

తాజాగా సుకు పూర్వాజ్ బర్త్ డే సందర్భంగా జ్యోతి రాయ్ ఓ పోస్ట్ పెట్టింది. "మనం కలిసి ఏడాది అయింది. అప్పటి నుంచి నా జీవితమంతా మారిపోయింది. నా ఫీలింగ్స్ ను చెప్పడానికి మాటలు సరిపోవు. నీ లవ్, హగ్స్, సపోర్ట్, పాజిటివ్ థాట్స్, సహనం, విధేయత, కేరింగ్ అలా అన్నింటికీ థ్యాంక్స్. నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం. విష్ యూ ఏ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే డార్లింగ్. లవ్ యూ" అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేటు వయసులో ఘాటు ప్రేమ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఏదేమైనా విషెస్ కూడా చెబుతున్నారు. వీరిద్దరూ పరిచయం అయిన ఆరేడు నెలల్లోనే ప్రేమ, పెళ్లి జరిగిపోయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం సుకు పూర్వాజ్ ఏ మాస్టర్ పీస్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో జ్యోతి రాయ్ కూడా నటిస్తోంది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

మరోవైపు గుప్పెడంత మనసు సీరియల్ నుంచి బయటకు వచ్చిన జ్యోతి రాయ్.. ఓటీటీలో వెబ్ సిరీసులు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఏ మాస్టర్ పీస్ తోపాటు ప్రెట్టీ గర్ల్, నో మోర్ సీక్రెట్స్ టైటిల్ తో రెండు వెబ్ సిరీస్ లు చేస్తోంది. ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్ లో జ్యోతి నటిస్తుండగా.. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది.