Begin typing your search above and press return to search.

జ్యోతి రాయ్.. బెడ్ పై స్టన్నింగ్ గా!

జ్యోతి రాయ్.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. గుప్పెడంత మనసు సీరియల్ తో ఈ కన్నడ బ్యూటీ ఫుల్ పాపులర్ అయింది.

By:  Tupaki Desk   |   21 March 2024 3:30 PM GMT
జ్యోతి రాయ్.. బెడ్ పై స్టన్నింగ్ గా!
X

జ్యోతి రాయ్.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. గుప్పెడంత మనసు సీరియల్ తో ఈ కన్నడ బ్యూటీ ఫుల్ పాపులర్ అయింది. ఆ సీరియల్ లోని జగతి పాత్రతో కన్నడ నాట దక్కించుకోలేని క్రేజ్ ను ఇక్కడ సంపాదించుకుంది. సీరియల్‌ లో చీరకట్టులో అమ్మతోపాటు టీచర్ రోల్ లో ఎంతో పద్ధతిగా కనిపించింది. కానీ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో కుర్రకారును నిద్ర పట్టకుండా చేస్తోంది.


ప్రస్తుతం సీరియల్ నుంచి బయటకొచ్చిన ఈ బ్యూటీ.. రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఏ మాస్టర్ పీస్ మూవీతో పాటు ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ రెండు కూడా రిలీజ్ కానున్నాయి. అయితే ఏ మాస్టర్ పీస్ సినిమా సమయంలో ఆ మూవీ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత తన ఇన్ స్టా హ్యాండిల్ పేరును జ్యోతి పూర్వాజ్ గా మార్చేసుకుంది.

ఇటీవల సుకు పూర్వాజ్ ను పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ మొదలుపెట్టింది. ఈ విషయం ఆమెనే చెప్పింది. ఆ మధ్య సుకు క్రియేట్ చేసిన సింబల్ ను ఎదపై టాటూగా వేయించుకుంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. దీంతోపాటు వీరిద్దరి రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అయితే జ్యోతికి 20 ఏళ్ల వయసులోనే వివాహం జరిగినా కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుంది.

మరోవైపు, సోషల్ మీడియాలో జ్యోతి.. గ్లామర్ కు షో బౌండరీలు లేవు. ఎప్పటికప్పుడు పొట్టి డ్రెస్సులో పోజులు ఇస్తూ హీటెక్కిస్తుంటోంది. కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. స్కిన్ షోతో కంప్లీట్ ఫిదా చేస్తుంటోంది. అందానికి పర్యాయ పదం తానేనని ప్రూవ్ చేసుకుంటోంది. ఘాటైన అందాలతో మత్తెక్కిస్తుంటోంది. తన ఎద అందాలతో నెటిజన్లను కవ్విస్తుంటోంది.

తాజాగా కొత్త ఫొటో షేర్ చేసింది జ్యోతి రాయ్. బ్లాక్ కలర్ సింగిల్ పీస్ డ్రెస్ లో బెడ్ పై కూర్చుని థైస్ షో చేసింది. హెయిర్ లీవ్ చేసి.. తన చూపులతో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది. జ్యోతి నయా ఫొటోకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. రోజురోజుకు జ్యోతి డ్రెస్ సైజ్ తగ్గిపోతుందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ కన్నడ బ్యూటీ భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.