Begin typing your search above and press return to search.

జగతి.. పొట్టి డ్రెస్సులో హీటెక్కించే అందం

ఇటీవల గ్లామర్ డోస్ ఒక్కసారిగా పెంచేసింది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో షూటైన పోజులతో మాయ చేస్తోంది. తాజాగా మరో పొట్టి డ్రెస్ లో దిగిన పిక్ ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 3:51 PM GMT
జగతి.. పొట్టి డ్రెస్సులో హీటెక్కించే అందం
X

జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం.. కన్నడ బ్యూటీ అయిన ఈ అమ్మడు.. అక్కడ సంపాదించుకోలేని క్రేజ్ ను తెలుగులో ఒక్క సీరియల్ తోనే దక్కించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ దగ్గరైంది. సోషల్ మీడియా ద్వారా యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఆ సీరియల్ లో రిషి- వసుధార రోల్స్ ఎంత ఫేమస్ అయ్యాయో.. జగతి పాత్ర కూడా అంతే ఫేమస్ అయ్యింది. తన నటనతో సీరియల్ ఆడియన్సను ఆకట్టుకుంది.

కొన్ని రోజుల క్రితమే ఓ యంగ్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుంది జ్యోతి రాయ్. ఈ విషయాన్ని ఆమెనే ఇన్ డైరెక్ట్ గా ఓ పోస్ట్ తో చెప్పింది. మాట రాని మౌనమిది, శుక్ర చిత్రాల దర్శకుడు సుకు పూర్వాజ్‌ ను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది జ్యోతి రాయ్. ప్రస్తుతం సుకు పూర్వాజ్.. ఏ మాస్టర్ పీస్ సినిమా తీస్తున్నారు. ఈ మూవీలో జ్యోతి రాయ్ కూడా నటిస్తోంది. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది పక్కన పెడితే.. జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో స్కిన్ షో చేస్తుంటోంది. గ్లామరస్ పిక్స్ ను షేర్ చేస్తూ హల్ చల్ చేస్తుంటోంది. నెట్టింట ఫుల్ హీట్ పుట్టిస్తుంటోంది. కుర్రకారును మాయ చేస్తుంటోంది. అందానికి ఇమేజ్ తానే అన్న విధంగా పోజులు ఇస్తుంటోంది. రకరకాల డ్రెస్సుల్లో వయ్యారాలు ఒలకబోస్తుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేస్తుంటోంది.

ఇటీవల గ్లామర్ డోస్ ఒక్కసారిగా పెంచేసింది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో షూటైన పోజులతో మాయ చేస్తోంది. తాజాగా మరో పొట్టి డ్రెస్ లో దిగిన పిక్ ను షేర్ చేసింది. గ్రే కలర్ మినీ స్కర్ట్, టాప్ వేసుకున్న అమ్మడు.. తన అందంతో ఫిదా చేస్తోంది. వయ్యారంగా నిల్చుని ఘాటు లుక్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ లో వరుణ్ తొలిప్రేమ మూవీలోని సునోనా సునయనా సాంగ్ ను యాడ్ చేసింది. బటర్ ఫ్లై ఈమోజీ క్యాప్షన్ గా ఇచ్చింది.

జ్యోతి రాయ్.. గ్లామరస్ పిక్ కు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. లవ్లీ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సీరియల్ లో పద్ధతిగా ఉండే మీరు.. సోషల్ మీడియాలో వేరే లెవల్ అంటున్నారు. ఎన్నటికీ తరగని అందం అంటూ కొనియాడుతున్నారు. రోజురోజుకు అందం పెరిగిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉన్న జ్యోతి.. ఎలాంటి హిట్లు కొడుతుందో చూడాలి.