Begin typing your search above and press return to search.

ముంబైకెళ్లిన త‌ర్వాత హీరో వైఫ్ లైఫ్ చేంజ్!

ఉన్న ప‌ళంగా చెన్నై నుంచి ముంబైకి వెళ్ల‌డంతో ర‌క‌ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి.

By:  Tupaki Desk   |   14 April 2024 2:30 AM GMT
ముంబైకెళ్లిన త‌ర్వాత హీరో వైఫ్ లైఫ్ చేంజ్!
X

ముంబైకెళ్లిన త‌ర్వాత సూర్య వైఫ్ జ్యోతిక లైఫ్ స్టైల్లో మార్పులొచ్చాయా? చెన్నై లైఫ్ స్టైల్-ముంబై లైఫ్ స్టైల్ మ‌ధ్య వ్య‌త్యాసం క‌నిపిస్తుందా? అంటే అవున‌నే అనిపిస్తుంది. జ్యోతిక ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైన త‌ర్వాత రిలాక్స్ అవుతుం ద‌నుకుంటే? అనూహ్యంగా కంబ్యాక్ ప్లాన్ చేసి ముందుకొచ్చి సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. లేడీ ఓరియేంటెడ్ క‌థ‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక జ్యోతిక‌-సూర్య దంప‌తులు ఇటీవ‌ల మ‌కాం చెన్నై నుంచి ముంబైకి మార్చిన సంగ‌తి తెలిసిందే. ఉన్న ప‌ళంగా చెన్నై నుంచి ముంబైకి వెళ్ల‌డంతో ర‌క‌ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి.


అయితే అలాంటిదేమి లేద‌ని పిల్ల‌ల చ‌దువుకోసం.. భ‌విష‌త్య్ కోసం ముంబైకి షిప్ట్ అయిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఇక అక్క‌డికి వెళ్లి నాటి నుంచి కొత్త జ్యోతిక‌ని ప‌రిచ‌యం చేసే ప‌నిలో ప‌డింది. వెళుతూనే బాలీవుడ్ లో భారీ స‌క్సెస్ తో ముంబై వెల్క‌మ్ చెప్పింది. అజ‌య్ దేవ‌గ‌ణ‌..మాధ‌వ‌న్..జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన `షైతాన్` భారి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇదే ఉత్సాహంలో మ‌రిన్ని హిందీ సినిమాలు చేస్తున్నారు.

తెలుగు పారిశ్రామిక వేత్త శ్రీకాంతో బొల్లా బ‌యోపిక్ లో న‌టిస్తున్నారు. అలాగే డ‌బ్బా కార్టెల్ అనే మ‌రో సినిమాలోనూ న‌టిస్తున్నారు. చెన్నై లో ఉన్నంత కాలం హిందీలో సినిమాలు చేసింది లేదు. అక్క‌డ నుంచి ముంబైకొచ్చిన నెలల గ్యాప్ లోనే కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది. అయితే కొత్త‌గా త‌మిళ సినిమాలైతే క‌మిట్ అవ్వ‌లేదు. సైన్ చేసిన ప్రాజెక్ట్ లు హిందీలోనే క‌నిపిస్తున్నాయి. `చంద్ర‌ముఖి` రిలీజ్ స‌మ‌యంలో ఓ మ‌ల‌యాళం సినిమా తో కూడా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

అప్ప‌టి నుంచి మ‌ళ్లీ త‌మిళ సినిమాల్లో క‌నిపించ‌లేదు. మరి గ్యాప్ కావాల‌ని తీసుకుంటుందా? వ‌చ్చిందా? అన్న‌ది తెలియాలి. అలాగే జ్యోతిక భ‌ర్త సూర్య‌తో క‌లిసి జిమ్ వీడియోలు కూడా పంచుకున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలో ఉన్నంత కాలం ఇలాంటి వీడియోలు ఏనాటు బ‌య‌ట‌కు రాలేదు. ఆమె జిమ్ రూమ్ వ‌ర‌కే ప‌రిమిత‌య్యాయి. ఇప్పుడు సూర్య‌తో పాటు ఆమె రెగ్యుల‌ర్ గా జిమ్ కి వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.