Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోయిన్ కి జ్యోతిక వీరాభిమాని!

బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ అని జ్యోతిక త‌న మ‌న‌సులో మాట రివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 7:49 AM GMT
ఆ స్టార్ హీరోయిన్ కి జ్యోతిక వీరాభిమాని!
X

న‌టుడి సూర్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత జ్యోతిక సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన చిత్రాలు మాత్ర‌మే చేస్తున్నారు. అయితే లేడీ ఓరియేంటెడ్ నాయిక‌గా స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా ఆమెకి ఆర‌క‌మైన గుర్తింపు రాలేదు. ఇప్ప‌టికే కొన్ని ప్ర‌య‌త్నాలు చేసారు గానీ..స‌రైన హిట్ ప‌డ‌లేదు. అలాగ‌ని క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లో అవ‌కాశాలు రావ‌డం లేద‌ని కాదు.

వాటిలోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ ఆమె న‌టించ‌డం లేదు. త‌ల‌ప‌తి విజ‌య్ చిత్రంలో తండ్రి పాత్ర‌కు భార్య రోల్ ఆఫ‌ర్ ముందుగానే ఆమెకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆమె నిర్ణ‌యం ఇంకా వెల్ల‌డించ‌లేదు. జ్యోతిక గ‌నుక ఎస్ చెబితే! సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆమే స్థాయిని మార్చే సినిమా అవుతుంద‌ని కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే..

ఎంత పెద్ద న‌టి అయినా అభిమానించే న‌టులంటూ ప్రతీ ఒక్క‌రికి కొంద‌రుంటారు. అలా జ్యోతిక అభిమానించే న‌టి ఎవ‌రంటే? బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ అని జ్యోతిక త‌న మ‌న‌సులో మాట రివీల్ చేసారు. ప్ర‌స్తుతం కంగ‌న 'చంద్ర‌ముఖి-2' లో చంద్ర‌ముఖి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌ముఖి మొద‌టి భాగంలో జ్యోతిక పాత్ర‌ని పోషించిన కంగ‌న‌పై మీ అభిప్రాయం ఏంటి? అన‌గా ఆ ర‌కంగా త‌న అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సినిమా కోసం ..అందులో కంగన పాత్ర చూడ‌టం కోసం ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు. 'చంద్రముఖి లుక్‌లో కంగ‌న అద్భుతంగా ఉంది. ఆమె నటన సినిమాలో చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని న‌మ్ముతున్నాను. కొంత మంది న‌టులు మాత్ర‌మే ఇలాంటి పాత్ర‌లు పోషించ‌గ‌ల‌రు. అందులో కంగ‌న క‌చ్చితంగా ఉంటారు' అని అన్నారు. ప్ర‌స్తుతం జ్యోతిక మ‌ల‌యాళంలో చిత్రం..బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నారు.