Begin typing your search above and press return to search.

హార‌ర్ బ్యాన‌ర్లో స్టార్ హీరో స‌తీమ‌ణి!

స్టార్ హీరో సూర్య స‌తీమ‌ణి జ్యోతిక సెకెండ్ ఇన్నింగ్స్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌తో ఆరంభంలో కాస్త తడ‌బ‌డినా? త‌ర్వాత ప‌ట్టాలెక్కేసారు.

By:  Srikanth Kontham   |   27 Dec 2025 10:12 AM IST
హార‌ర్ బ్యాన‌ర్లో స్టార్ హీరో స‌తీమ‌ణి!
X

స్టార్ హీరో సూర్య స‌తీమ‌ణి జ్యోతిక సెకెండ్ ఇన్నింగ్స్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌తో ఆరంభంలో కాస్త తడ‌బ‌డినా? త‌ర్వాత ప‌ట్టాలెక్కేసారు. ప్ర‌త్యేకించి బాలీవుడ్లో జ‌ర్నీ మొద‌లైన త‌ర్వాత జ్యోతిక వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. అజ‌య్ దేవ‌గ‌ణ్,మాధ‌వ‌న్, జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన సైక‌లాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ `షైతాన్` మంచి విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. అటుపై తెలుగు పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బ‌యోపిక్లో న‌టించి మంచి విజ‌యం అందుకున్నారు.

టీచ‌ర్ అండ్ మెంట‌ర్ పాత్ర‌లో జ్యోతిక పాత్ర తెర‌పై అద్బుతంగా పండింది. ఈ ఏడాది `డ‌బ్బా కార్టెల్` అంటూ క్రైమ్ డ్రామాతోనూ అల‌రించారు. నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం అశ్వినీ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఎక్స్ ఎల్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టా త్మ‌కంగా నిర్మిస్తుంది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. తాజాగా జ్యోతిక హార‌ర్ చిత్రాల‌కు బ్రాండ్ గా మారిన మ‌డాక్ ఫిల్మ్స్ తో హార‌ర్ వ‌రల్డ్ లోకి అడుగు పెట్ట‌బోతుంది? అన్న‌ది మ‌రో స‌మాచారం.

`మ‌ర్డ‌ర్ ముబార‌క్`, `మూంజ్యా`, `స్త్రీ 2` , `థామా` లాంటి వ‌రుస విజ‌యాల‌తో మ‌డాక్ ఫిల్మ్స్ ఈ జాన‌ర్ చిత్రాలు నిర్మించ‌డంలో ప్ర‌త్యేకంగా గుర్తింపు ద‌క్కించుకుంది. ఓ వైపు క‌మ‌ర్శియ‌ల్ కాన్సెప్ట్ ల‌తో విజ‌యాలు అందు కుంటున్నా? హార‌ర్ జోన‌ర్ చిత్రాలు సైతం విజ‌యం సాధించ‌డంతో? బాలీవుడ్ లో మ‌డాక్ ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో మ‌డాక్ బ్యాన‌ర్ మ‌రిన్ని హార‌ర్ చిత్రాల‌కు నిర్మించే దిశ‌గా అడుగులు వేస్తోంది.ఇప్ప‌టికే కొన్ని స్టోరీల‌ను కూడా లాక్ చేసి పెట్టింది. యానిమేష‌న్ లో `స్త్రీ 3` ని రూపొందిస్తున్నారు.

అలాగే ఇదే ప్రాంచైజీ నుంచి మ‌రో రెండు సినిమాలకు రంగం సిద్దం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ క‌థ‌లు..అందులో పాత్రల‌కు త‌గ్గ న‌టీన‌టుల్ని ఎంపిక చేస్తున్నారు. దీనిలో భాగంగానే జ్యోతిక‌తో మ‌డాక్ బ్యాన‌ర్ ఒప్పందం చేసుకు న్న‌ట్లు తెలుస్తోంది. జ్యోతిక కు ఈ బ్యాన‌ర్లో ఇదో మంచి అవ‌కాశంగా చెప్పొచ్చు. మ‌రి ఏ సినిమాలో జ్యోతిక భాగ‌మ వుతుంది? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం మ‌డాక్ బ్యాన‌ర్లో మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. `కాక్ టెయిల్ 2`, శ్ర‌ద్దా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో `ఈత‌` లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్నాయి. అలాగే ధ‌ర్మేంద్ర‌, అగస్త్య నందా, జైదీప్ అళ్ల‌వాత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `ఇక్కీస్` చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూడు 2026లో రిలీజ్ అయ్యే ప్రాజెక్ట్ లు.