Begin typing your search above and press return to search.

సెల్ఫీ స్టైల్ తో హీటెక్కించిన జ్యోతి పూర్వాజ్

ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చిన నటి జ్యోతి పూర్వాజ్ తాజా ఫోటో షేర్ చేసి నెట్టింట గ్లామర్ హీట్ పెంచింది.

By:  Tupaki Desk   |   7 July 2025 11:30 AM IST
సెల్ఫీ స్టైల్ తో హీటెక్కించిన జ్యోతి పూర్వాజ్
X

ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చిన నటి జ్యోతి పూర్వాజ్ తాజా ఫోటో షేర్ చేసి నెట్టింట గ్లామర్ హీట్ పెంచింది. రెడ్ కలర్ టాప్‌లో మెరిసిపోయిన ఆమె స్టైలిష్ లుక్‌కు సెల్ఫీ మిర్రర్ పోజ్‌తో ప్రత్యేకతను జత చేసింది. ఆమె వేసిన క్రీమ్ కలర్ ట్రౌజర్‌కు కలిపిన ఫ్యాషన్ సెన్స్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోలో ఆమె కళ్లలో కనిపించిన కాన్ఫిడెన్స్, చిరునవ్వు, హేర్ స్టైలింగ్ అన్నీ కలసి ఓ స్టన్నింగ్ ఇంప్రెషన్ ఇచ్చాయి.


జ్యోతి పూర్వాజ్ చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ప్రత్యేక శైలిని చూపిస్తోంది. మోడలింగ్‌లో తక్కువ కాలంలోనే గుర్తింపు సంపాదించిన ఆమె, సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను నెమ్మదిగా నిర్మించుకుంటోంది. టీవీ షోలు, యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా జనానికి మరింత చేరువైంది. గతంలో ఆమె కొన్ని చిత్రాల్లోనూ నటించి తన నటనా ప్రతిభను ప్రూవ్ చేసుకుంది.

ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గ్లామర్‌తో పాటు, స్మార్ట్‌నెస్ కలిపిన నటిగా ఆమెను ప్రేక్షకులు గుర్తించడంతో అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఆమె క్రేజ్‌ను చూపిస్తుంది. ఒక్కో ఫోటోపోస్ట్‌కు వేలల్లో లైక్స్ రావడం, కామెంట్స్‌తో నిండిపోవడం చూస్తుంటే ఆమెకు ఫ్యాన్ బేస్ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది.

తాజా ఫోటో కూడా అంతే కేబిన్‌ రూమ్‌లో మిర్రర్‌తో తీసుకున్న సెల్ఫీ ఆమె స్మార్ట్‌నెస్‌కు, గ్లామర్‌కి ఉదాహరణగా నిలిచింది. ఆ ఫోటోలోని సింపుల్ న్యాచురల్ లుక్, ఆకర్షణీయమైన బాడీ లాంగ్వేజ్ చూసి నెటిజన్లు “ఫైర్,” “క్వీన్,” వంటి కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే, జ్యోతి పూర్వాజ్ త్వరలో ఓటీటీ ఫిల్మ్‌కి సైన్ చేసినట్లు సమాచారం. ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పటికే తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె, నటనలో కూడా అదే స్థాయిలో దూసుకెళ్లేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.