పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు..!
అంతేకాదు స్పీచ్ లో భాగంగా ప్రతి శతాబ్ధానికి ఒక ఛత్రపతి పుడతారు. ఈ 21వ శతాబ్ధానికి పవన్ కళ్యాణ్ ఉండటం మన అదృష్టమని అన్నారు జ్యోతి కృష్ణ.
By: Tupaki Desk | 22 July 2025 9:37 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో సినీ, రాజకీయ ప్రముఖులతో కోలాహలంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ స్పీచ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చింది.
హరి హర వీరమల్లు టైటిల్ పెట్టింది క్రిష్ గారే.. ఛత్రపతి శివాజీ ఉన్నంతకాలం ఔరంగజేబుకి నిద్రపట్టకుండా చేశాడు. శివాజి 1680లో చనిపోయారు. అప్పుడు ఈ సినిమా కథ మొదలవుతుంది అన్నారు. మొఘలుల నుంచి జ్యోతిర్లింగాలు, కాశీ క్షేత్రం కాపాడటమే కాదు ధర్మ స్థాపన కోసం ఒక యోధుడు చేసిన పోరాటమే హరి హర వీరమల్లు సినిమా అని అన్నారు జ్యోతి కృష్ణ.
అంతేకాదు స్పీచ్ లో భాగంగా ప్రతి శతాబ్ధానికి ఒక ఛత్రపతి పుడతారు. ఈ 21వ శతాబ్ధానికి పవన్ కళ్యాణ్ ఉండటం మన అదృష్టమని అన్నారు జ్యోతి కృష్ణ. ఈ టైం లో సనాతన ధర్మ గురించి పోరాటం చేసే వాళ్లు మనతో ఉండటం గొప్ప విషయం. ఈ సినిమాలో ఒక ఫైట్ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం చేసే పోరాటం ఏంటో తెలుస్తుంది. ఆ ఫైట్ చూసి త్రివిక్రం గారు ప్రశంసించారు.
ఇదే క్రమంలో తన తండ్రి ఏ.ఎం.రత్నం గురించి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇస్తారు.. మా నాన్న మంచి పేరు సంపాదించి ఇచ్చారు. ఆయన వల్లే పవన్ గారితో సినిమా చేశానని అన్నారు. సినిమా పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ సార్ చూశారు. రెండు రోజుల తర్వాత త్రివిక్రం గారు ఫోన్ చేసి రెండు గంటలు నీ గురించి మాట్లాడారని చెబితే అంతకన్నా గొప్ప ప్రశంస లేదనిపించిందని అన్నారు జ్యోతి కృష్ణ.
ఈవెంట్ లో నిర్మాత ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినా కూడా హరి హర వీరమల్లు చాలా స్పెషల్ అని అన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది. హిస్టారికల్, పాన్ ఇండియా మూవీ చేసినందుకు గర్వంగా ఉందని అన్నారు ఏ.ఎం రత్నం. సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారని అన్నారు.
