రూ.250 కోట్లతో వీరమల్లు.. 'సీజ్ ది షిప్' లాంటి సీన్స్: జ్యోతి కృష్ణ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నిజానికి మరో ఐదు రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా.. మళ్లీ వాయిదా పడింది.
By: Tupaki Desk | 7 Jun 2025 10:14 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నిజానికి మరో ఐదు రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా.. మళ్లీ వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
అయితే ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ.. మరోవైపు ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. రీసెంట్ గా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మంగినపూడి బీచ్ ఫెస్టివల్ లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొని సందడి చేశారు. ఆ సమయంలో వేదికపై మాట్లాడిన జ్యోతి కృష్ణ, ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
తనను పవన్ నమ్మారని, అందుకు తగ్గట్లే సినిమాను పూర్తి చేశానని జ్యోతి కృష్ణ తెలిపారు. మూవీని ఇప్పటివరకు పవన్ ఒక్కసారి కాదు.. మూడు సార్లు చూశారని చెప్పారు. ఆ తర్వాత ప్రశంసలతో ముంచెత్తిన పవన్.. గంటపాటు అభినందించారని పేర్కొన్నారు. తనతో మరోసారి వర్క్ చేయడానికి మొగ్గు చూపినట్టు వెల్లడించారు.
రూ.250 కోట్ల బడ్జెట్ తో హరిహర వీరమల్లును ఏఎం రత్నం గారు నిర్మించారని తెలిపారు. కథకు ప్రాణం పోసేందుకు ఆయన భారీ స్థాయిలో బడ్జెట్ ను పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఎంఎం కీరవాణి గారు స్వరపరిచిన అసుర హననం సీక్వెన్స్ ను పవన్ 500 సార్లు చూశారని జ్యోతి కృష్ణ వెల్లడించారు.
"సినిమాలో బందర్ పోర్ట్ నేపథ్యంలో సూపర్ సీక్వెన్స్ ఉంది. 16వ శతాబ్దంలో పోర్ట్ ఎలా ఉందనేది మేం క్రియేట్ చేశాం. అందుకు అవసరమైన సీజీ వర్క్ కోసం రెండేళ్ల కష్టపడ్డాం. బ్రిటిష్ వాళ్ళు మచిలీ పట్నం హార్బర్ కు వస్తే పవన్ గారు ఎదిరిస్తారు. ఆ సీక్వెన్స్ కోసం ఆయన మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు" అని తెలిపారు.
"మూవీ ఆ సీక్వెన్స్ చూస్తే మాత్రం.. మచిలీపట్నం ప్రజలతోపాటు అంతా దద్దరిల్లి పోతారు. ముఖ్యంగా పవన్ గారు సీజ్ ది షిప్ అన్న మాటకు తగ్గట్టుగా సినిమాలో సీన్స్ ఉంటాయి. అయితే వీరమల్లు మూవీ స్టోరీ బందర్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఒకప్పుడు మచిలీపట్నం హార్బర్ తో వ్యాపారాలు జరిగేవి" అని చెప్పారు. ఇప్పుడు జ్యోతి కృష్ణ కామెంట్స్ వైరల్ కాగా.. సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
