ఆయన్ను డైరెక్ట్ చేయడమే అవార్డు తో సమానం
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టి సినిమాలోని అసుర హననం అనే సాంగ్ ను ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేసి ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చి సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
By: Tupaki Desk | 21 May 2025 4:22 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఎప్పుడో ఐదేళ్ల కిందట మొదలైన ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మొదట్లో ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా, ఆ తర్వాత క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో వీరమల్లు నిర్మాత కొడుకు, డైరెక్టర్ జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి పార్టు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టి సినిమాలోని అసుర హననం అనే సాంగ్ ను ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేసి ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చి సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను డైరెక్టర్ చేయడం తనకు అవార్డు లాంటిదని, వీరమల్లు సినిమా తెరకెక్కడానికి మెయిన్ రీజన్ క్రిష్ అని, ఆయన మొదలుపెట్టి, టార్చ్ లైట్ వేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేశానని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపాడు. అసుర హననం సాంగ్ టైటిల్ ను కీరవాణి ఫిక్స్ చేశాడరని, ఈ సాంగ్ లోని ఫైట్స్ మొత్తాన్ని పవన్ కళ్యాణే డిజైన్ చేసి కొరియోగ్రఫీ చేశారని, రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఖడ్గం లాంటి బాబీ డియోల్ పాత్రకీ, ధైర్యం లాంటి పవన్ కళ్యాణ్ పాత్రకు మధ్య జరిగే యుద్ధాన్ని చూపించామని చెప్పాడు.
హరిహర వీరమల్లు సినిమా తనకెంతో స్పెషల్ అని, 5 ఏళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఇప్పటికి పూర్తైందని, సినిమా మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ తనలో ఎన్నో మార్పులొచ్చాయని హీరోయిన్ నిధి అగర్వాల్ వెల్లడించింది. సాధారణంగా తాను ఒకరి ఫ్యాన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడనని, కానీ తన మనసులో ఎవరినైనా అభిమానిస్తుందంటే అది పవన్ కళ్యాణ్‌నే అని, ఆయనతో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని నిధి తెలిపింది.
వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణకు మంచి ఫ్యూచర్ ఉందని, సినిమాకు సంబంధించిన అన్ని పనుల్ని తానొక్కడే చూసుకున్నాడని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తెలిపాడు. హరిహర వీమల్లు లాంటి సినిమా పవన్ కళ్యాణ్ కు మాత్రమే సరిపోతుందని ఆయనొక మూర్తీభవించిన ధర్మాగ్రహమని కీరవాణి చెప్పాడు. ఈ సినిమాలోని ఐటెం సాంగ్ లో పవన్ ను ఉద్దేశించి కొన్ని లిరిక్స్ రాస్తే ఇప్పుడు తనపై చాలా బాధ్యత ఉందని, పవన్ ఆ లిరిక్స్ ను మార్చేశారని, ఆయన గొప్పతనానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదని అన్నాడు.
