Begin typing your search above and press return to search.

ఫోటోగ్రాఫ‌ర్ల‌పై విరుచుకుప‌డ్డ గాయ‌కుడు

అత‌డు వేదిక ఎక్కి మైక్ ప‌ట్టుకుంటే చాలు.. జ‌నం గ‌గ్గోలు పెడ‌తారు.. అత‌డి పాట కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ప‌డిగాపులు ప‌డ‌తారు.

By:  Tupaki Desk   |   11 April 2025 8:57 AM IST
ఫోటోగ్రాఫ‌ర్ల‌పై విరుచుకుప‌డ్డ గాయ‌కుడు
X

అత‌డు వేదిక ఎక్కి మైక్ ప‌ట్టుకుంటే చాలు.. జ‌నం గ‌గ్గోలు పెడ‌తారు.. అత‌డి పాట కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ప‌డిగాపులు ప‌డ‌తారు. అత‌డు ఆడుతూ పాడుతూ ఉంటే అతడితో పాటే ఆడతారు పాడ‌తారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉన్న ఈ ప్ర‌ముఖ గాయ‌కుడు ఇటీవ‌ల కుటుంబ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నాడని హాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అత‌డు మ‌రెవ‌రో కాదు.. జ‌స్టిన్ బీబ‌ర్.

కార‌ణం ఏదైనా అత‌డు ఇటీవ‌ల మీడియా ఫోటోగ్రాఫ‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నాడు. అత‌డిని వెంబ‌డించి ఫోటోలు తీయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే ``డ‌బ్బు డ‌బ్బు డ‌బ్బు కావాలి మీకు.. దానికోసం ఎంత‌కైనా తెగిస్తారు!`` అంటూ విరుచుకుప‌డుతున్నారు. వీళ్లంతా డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటున్నారని ఆరోపించారు. అత‌డు ఒక కేఫ్ నుండి బయటకు వెళ్లినప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ `గుడ్ మార్నింగ్` చెప్పినా అత‌డిపైనా చిరాకు పడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎందుక‌నో ఈ ఉదయం ఆ గాయకుడి మ‌న‌సు అంతగా బాగా అనిపించలేదు. అతడు హ్యాపీ మూడ్‌లో లేడు. దానివ‌ల్ల ఫోటోగ్రాఫ‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నాడు. ఈ వీడియో చూశాక‌.. నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. అతడి ప్ర‌వ‌ర్త‌న‌ గురించి ఆందోళన చెందారు.

ఇప్పుడు ఇంటర్నెట్ లో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో బీబర్ తన ముఖాన్ని కప్పుకుని కెమెరాల వైపు నడుస్తూ వికృతంగా విరుచుకుప‌డ్డాడు. ``డబ్బు, డబ్బు, డబ్బు, డబ్బు, డబ్బు... ఇక్కడి నుండి వెళ్లిపోండి బ్రో. డబ్బు.. మీకు కావలసిందల్లా అంతే. మీరు మనుషుల గురించి పట్టించుకోరు! అని సీరియ‌స్ అయ్యాడు. ``మీరు పట్టించుకునేది అంతే.. డబ్బు గురించి మాత్ర‌మే ప‌ట్టించుకుంటారు... మీరు ప్రజల గురించి పట్టించుకోరు`` అని 31 ఏళ్ల గాయకుడు రిపీటెడ్‌గా తిడుతూ కేఫ్ లోపలికి నడిచాడు.

బీబర్ తన అసౌకర్యాన్ని లేదా నిరాశను బహిరంగంగా వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాస్ ఏంజిల్స్‌లో భార్య హేలీ బీబర్ కార్యక్రమంలో అత‌డు ఆందోళనగా, అసౌకర్యంగా ఉన్నట్లు క‌నిపించే ఒక వీడియో వైర‌ల్ అయింది. అది చూసిన త‌ర్వాత అతడి అభిమానులు ఆందోళన చెందారు.

బీబర్ కష్టాలను ఎదుర్కొంటున్నాడని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. అయితే మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి ఊహాగానాలను గాయకుడి ఏజెన్సీ ఖండించింది. కొన్ని నెలల క్రితం బీబర్, హేలీ వివాహం ఇబ్బందుల్లో ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ ఆ జంట ఈ పుకార్లపై స్పందించలేదు.