Begin typing your search above and press return to search.

జురాసిక్‌ వరల్డ్‌: రీ బర్త్‌ సంగతేంటి? టాక్ ఎలా ఉందంటే?

మూడేళ్ల క్రితం వచ్చిన జురాసిక్ వరల్డ్: డొమినియన్ కు సీక్వెల్ గా ఇప్పుడు జురాసిక్ వరల్డ్: రీ బర్త్ మూవీ రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ తోపాటు ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ విడుదలైంది. మరి సినిమా పబ్లిక్ టాక్ ఏంటంటే?

By:  Tupaki Desk   |   5 July 2025 9:30 AM IST
జురాసిక్‌ వరల్డ్‌: రీ బర్త్‌ సంగతేంటి? టాక్ ఎలా ఉందంటే?
X

జురాసిక్‌ పార్క్‌.. 32 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా పెద్దలను, పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది. ఇంగ్లీష్ వెర్షన్ తోనే ఇండియాలో కూడా రికార్డులు సాధించిన తొలి హాలీవుడ్ మూవీ అదే. రాకాసి బల్లులతో చేయించిన విధ్వంసం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది.

ఆ తర్వాత జురాసిక్ సిరీస్ లో వేర్వేరు దర్శకులు పలు సినిమాలు తీశారు. మూడేళ్ల క్రితం వచ్చిన జురాసిక్ వరల్డ్: డొమినియన్ కు సీక్వెల్ గా ఇప్పుడు జురాసిక్ వరల్డ్: రీ బర్త్ మూవీ రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ తోపాటు ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ విడుదలైంది. మరి సినిమా పబ్లిక్ టాక్ ఏంటంటే?

అయితే జురాసిక్ పార్క్ పేరుతో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్ గా మారిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత స్టోరీ రొటీన్ గా అనిపించడం, అవే డైనోసార్లు కనబడడం, సీన్స్ లో కొత్తదనం లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. 2022లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌: డొమినియన్‌ విషయంలో అదే జరిగింది.

ఇప్పుడు జురాసిక్ వరల్డ్: రీ బర్త్ విషయానికొస్తే.. కంటెంట్ సేమ్ రొటీన్ గా ఉందని సినీ ప్రియులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు స్కార్లెట్‌ జాన్సన్‌, మహర్షలా అలీ, జొనాథన్‌ బెయిలీ, రూపర్ట్‌ ఫ్రెండ్‌ అందరూ తమ రోల్స్ కు న్యాయం చేశారని చెబుతున్నారు, పాత్ర పరిధి మేరకు నటించారని అంటున్నారు.

టెక్నికల్‌ టీమ్‌ బాగానే వర్క్ చేసిందని, డైరెక్టర్ గారెత్‌ ఎడ్వర్డ్స్‌ కష్టపడ్డారని అంటున్నారు. కానీ బలమైన కథ, ఎమోషనల్‌ డ్రామా లేదని చెబుతున్నారు. కొత్తదనం కొంచెం కూడా లేదని కామెంట్లు పెడుతున్నారు. క్లైమాక్స్‌ లో మ్యూటెంట్‌ డైనోసార్‌ అంటూ ఏలియన్‌ లా చూపించడం బాలేదని, కొన్ని సీన్స్ నవ్విస్తాయని చెబుతున్నారు.

విపరీతంగా అంచనాలతో సినిమాకు వెళ్తే అసలు సాటిస్ఫికేషన్ ఉండదని అంటున్నారు. ఫ్యాన్ అయితే కాస్త ఎంజాయ్ చేయొచ్చని, ఎక్స్పెక్టేషన్స్ వద్దని చెబుతున్నారు. డైనోసర్ వెంటపడే ఎపిసోడ్ తో పాటు విన్యాసాలు మాత్రం అలరిస్తాయని.. అంతకు మించి ఎలాంటి హైలెట్స్ లేవని అంటున్నారు. మరి మీరు సినిమాను చూశారా? మీకేం అనిపించింది?