Begin typing your search above and press return to search.

వెల్‌కమ్‌ టు జపాన్‌.. లవ్‌ యూ తారక్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ గురించి అంతర్జాతీయ మీడియా కూడా పలు రకాల కథనాలను ప్రచురించడం జరిగింది

By:  Tupaki Desk   |   28 Dec 2023 10:55 AM GMT
వెల్‌కమ్‌ టు జపాన్‌.. లవ్‌ యూ తారక్‌!
X

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. జంతువుల మధ్య ఎన్టీఆర్‌ ఫైట్‌ చేసిన సన్నివేశాలు మరియు ఆ సమయంలో ఎన్టీఆర్‌ చూపించిన రౌద్రం ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ క్రియేట్‌ అయ్యేలా చేశాయి అనడంలో సందేహం లేదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ గురించి అంతర్జాతీయ మీడియా కూడా పలు రకాల కథనాలను ప్రచురించడం జరిగింది. జపాన్ లో ఎన్టీఆర్‌ రాబోయే సినిమాల కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూపులు మొదలు పెట్టారు. తాజాగా ఎన్టీఆర్ కు జపాన్‌ లో ఉన్న ఫాలోయింగ్‌ కి ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా ఎన్టీఆర్ న్యూ ఇయర్ వెకేషన్ కి కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌ కు ఘన స్వాగతం పలికారు స్థానిక ఫ్యాన్స్‌. ఈ రేంజ్‌ లో ఆహ్వానం ఉంటుందని తాము ఊహించలేదు అంటూ ఎన్టీఆర్‌ సన్నిహితులు అంటున్నారు. వెల్‌కమ్‌ టు జపాన్‌.. వీ లవ్ యు తారక్.. దేవర సినిమా కోసం ఎదురు చూస్తున్నామంటూ ఎన్టీఆర్‌ కు జపాన్ స్వాగతం తెలిపింది.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ ను పూర్తి చేశారని, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు షూటింగ్ ముగిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. 2024 సమ్మర్ లో సినిమా విడుదల అవ్వబోతుంది.