Begin typing your search above and press return to search.

శ్రీలీల 'వైరల్' సాంగ్ కు శివన్న స్టెప్పులు చూశారా?

యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 July 2025 3:40 PM IST
శ్రీలీల వైరల్ సాంగ్ కు శివన్న స్టెప్పులు చూశారా?
X

యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వ్యాపారవేత్త గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ఆ సినిమాలోని పాట.. ఎక్కడ చూసినా అదే వినిపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.

మరోసారి వైరల్ వయ్యారి సాంగ్ తో తన టాలెంట్ ఏంటో శ్రీలీల ప్రూవ్ చేసుకుంది. తనదైన డ్యాన్స్, గ్రేస్ తో సందడి చేసిన అమ్మడు.. పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కిరీటి కూడా పవర్ ఫుల్ స్టెప్పులతో మెప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన ఆయన.. తన అభిమాన హీరోలానే డ్యాన్స్ చేశారని అంతా కొనియాడారు.

మొత్తానికి జూలై 18వ తేదీన రిలీజ్ కానున్న జూనియర్ మూవీకి వైరల్ వయ్యారి సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. ఇప్పుడు ఆ పాటకు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్టెప్పులు వేసి సందడి చేశారు. ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రీసెంట్ గా మేకర్స్.. బెంగళూరులో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి శివరాజ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో కిరీటి.. శివన్నతో డ్యాన్స్ చేయించారు. వయ్యారి పాట స్టెప్పు నేర్పించారు. దీంతో వెంటనే స్టెప్ ను గ్రహించిన శివన్న.. తన డ్యాన్స్ తో ఫిదా చేశారు.

శివన్న డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. సూపర్ గా డ్యాన్స్ చేశారని చెబుతున్నారు. అదుర్స్ సార్ అంటూ కొనియాడుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై వైరల్ వయ్యారి పాటను చూసేందుకు వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ పెడుతున్నారు.

కాగా.. జూనియర్ మూవీ విషయానికొస్తే.. కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తున్న ఆ సినిమాలో జెనీలియా దేశ్‌ ముఖ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరి మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.